వంద సంవత్సరాల భారత కమ్యూనిస్టు ఉద్యమం అనుభవాలు-గుణపాఠాలు / Hundred years of Indian Communist Movemant Experiences and Lessons
G. Sathya Narayana Reddy / జి. సత్య నారాయణ రెడ్డి. · Politics

Price: Rs. 95. మనదేశంలోని నిర్దిష్ట వాస్తవ పరిస్థితులకు మార్క్సిజం-లెనినిజాన్ని సృజనాత్మకంగా అన్వయించి, ఒక సరైన విప్లవ ప్రజాపంథాను రూపొందించడంలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర నాయకత్వాలు విఫలమవుతూ వచ్చాయి. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో ఆనాటి ఆంధ్రరాష్ట్ర కమిటీ ఒక సరైన విప్లవ పంథాను రూపొందించుకొని విప్లవోద్యమాన్ని ఉన్నత స్థాయికి తీసుకవెళ్ళింది. కానీ, ఆనాటి పార్టీ కేంద్రనాయకత్వం ఆ పోరాటాన్ని ఏకపక్షంగా విరమించి, పార్లమెంటరీ పంథాను చెపట్టింది. నక్సల్బరీ పోరాటం ద్వారా విప్లవోద్యమాన్ని పురోగమింపజేయటానికి మరో అవకాశం వచ్చినప్పటికీ, ఆనాటి మార్క్సిస్టు- లెనినిస్టు గ్రూపుల నాయకత్వాలు అనుసరించిన అతివాద దుస్సాహసిక, మితవాద అవకాశవాద పంథాల కారణంగా త్వరలోనే అవి దెబ్బతిని పోయాయి. ఆనాటి నుండి ఇప్పటి వరకూ ఆ తప్పుడు పంథాలే విప్లవ కారుల్లో ప్రధానంగా కొనసాగుతూ వస్తున్నాయి. నక్సల్బరీ పోరాటం తర్వాత కాలంలోనే వాటి పక్కనే ఒక సరైన విప్లవ ప్రజా పంథా కూడా రూపొందిచబడినప్పకీ, అది తగిన విధంగా పెద్ద ఎత్తున అమల్లోకి రాలేదు. దేశంలో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకవెళ్ళడానికి ఒక సరైన విప్లవ పంథాతో పాటుగా, దాన్ని సరైన పద్ధతుల్లో అమలు జరపాల్సి వుంటుంది. అప్పుడే దేశంలోని విప్లవోద్యమం ముందుకు పోతుంది. ఆ లక్ష్యసాధనకోసం దేశంలోని కమ్యూనిస్టు విప్లవకారుల మధ్యన ఒక పెద్ద చర్చ (Great Debate) జరగాల్సిన ఆవశ్యకత నేడెంతోవుంది. ఆ వైపుగా ఆలోచించడం, అవసరమైన చర్యలు తీసుకోవడం కమ్యూనిస్టు విప్లవ కారులముందున్న తక్షణ కర్తవ్యం.