వంతెన / Vantena

ఉషారాణి భాటియా / Usharani Bhatia · Books

వంతెన / Vantena book cover

Price: Rs. 45. ఉషారాణి బాటియా 1932లో, మద్రాసులో, రచయితలకీ, కళాకారులకి నిలయమైన కొమ్మూరి వారింట - చలంగారి తమ్ముడు కొమ్మూరి వెంకట్రామయ్య, ప్రముఖ రచయిత్రి పద్మావతి గార్ల ఆఖరి సంతానంగా, సాంబశివరావుగారి చెల్లెలుగా జన్మించారు. విద్యాభ్యాసం ఆంధ్రమహిళాసభ స్కూలులో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ., బి.యల్. డిగ్రీలు పొందారు. 1960లలో జర్నలిస్టుగా ఆంధ్ర పత్రికలో ఓనమాలు దిద్దుకుని, ప్రభుత్వ అనువాదశాఖలో ఉద్యోగరీత్యా ఢిల్లీక్ చేరారు. దరిమిలా దుర్గాబాయి దేశముఖ్ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారి "సోషల్ వెల్ఫేర్' పత్రిక సంపాదకవర్గంలో పనిచేస్తూండగా సుమేంద్రసింగ్ బాట్య గారి జీవితభాగస్వామి అయ్యారు. చివరగా, చాలాకాలంపాటు నేషనల్ బుక్స్ట్, ఇండియా తెలుగు ప్రచురణ విభాగం సంపాదకురాలిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఒక భారతీయ భాషలోని ఉత్తమ గ్రంథాల్ని అనువదించి ప్రచురించి యితర భాషలవారికి అందించడం ధ్యేయంగా గల యస్.బి.టి. వారి 'ఆదాస్ ప్రధాన్' ప్రణాళిక ద్వారా ఉత్తమ తెలుగు గ్రంథాలు యితర భారతీయ భాషల్లోకి అనువాదం కావడానికీ, అలాగే ఆ భాషల నుంచి తెలుగులోకి అనువాదమై వెలువడడానికి కృషి చేశారు. విద్యార్థినిగా వున్న రోజుల్లోనే రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టారు. వివిధ పత్రికలలో వీరి కథలు, వ్యాసాలు, సమీక్షలు, ఇంటర్వ్యూలు ప్రచురితమయ్యాయి, వీరి పిల్లల నవల 'అడవిలో చిన్నారి'ని ఆదునిక గ్రంథమాలవారు ప్రచురించారు. ఇతర నవలలు: తండ్రి కూతురూ, ప్రతీకారం, అరుణోదయం మొదలై నవి. ఎన్నో అనువాదాలు చేశారు. వీరి కథలు కొన్ని హిందీలోకి అనువాదమయ్యాయి.

Browse more Telugu books