లియొనార్డో ద వించి / LEONARDO DA VINCI

వి. శ్రీనివాస చక్రవర్తి / SRINIVASA CHAKRAVARTHY · History

లియొనార్డో ద వించి / LEONARDO DA VINCI book cover

Price: Rs. 65. లియొనార్డోద వించి ఇటలీ కళాకారుడు, యూరపు పునర్వికాస యుగాన్ని మరింత కాంతిమయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. లియొనార్డో శిల్పి. వర్ణ చిత్రకారుడు. లేఖా చిత్రకారుడు, స్థపతి, శాస్త్రవేత్త, ఇంజినీరు. జీవశాస్త్ర నిపుణుడు, మేధావి. అనేక రంగాల్లో ప్రావిణ్యం కలిగిన వ్యక్తులను పునర్వికాస మానవుడు (renaissance man) అంటారు. అలా అనిపించుకొనే హక్కు లియొనార్డోకి మించి మరెవరికీ ఉండదు. ఆయన 1452లో ఏప్రిల్ 15వ తేదీన పుట్టాడు. 1619లో మే 2వ తేదీన తన 68వ ఏట చనిపోయాడు. కళా రూపాలన్నిటిలోనూ చిత్రకళే మిన్న అంటాడు లియొనార్డో: "శిల్పకళలోను, చిత్రకళలోను నేను సమానంగా కృషి చేశాను. శిల్పం రక్తికట్టాలంటే వెలుగునీడల లాస్యం అవసరం. కాని చిత్రానికి కావలసిన వెలుగు నీడలు అందులోనే పొందుపరచబడి వుంటాయి. అలాగే దూరాన్ని వర్ణాన్ని ఒక చిత్రం చూపించినట్టు శిల్పం ప్రదర్శించలేదు. శిల్పాన్ని మీరు అన్ని పక్కల నుండి తిలకించొచ్చు. అన్ని పార్శ్వాల నుండి చూడొచ్చు. కాని చిత్రంలో వస్తువు గుండ్రంగా ఉన్నట్టు కనపడినా, నిజానికి మీరు చదునైన తలాన్ని మాత్రమే చూస్తున్నారు" అన్నాదాయన.

Browse more Telugu books