రిజర్వేషన్ల వర్గీకరణ ప్రజాస్వామిక దృక్పథం /Sub- Classification of SCs - A Democratic perspective

కె. బాలగోపాల్ /K.Balagopal · Politics

రిజర్వేషన్ల వర్గీకరణ ప్రజాస్వామిక దృక్పథం /Sub- Classification of SCs - A Democratic perspective book cover

Price: Rs. 145. వర్గీకరణ వల్ల దళితుల మధ్య అనైక్యత తలెత్తుతుంది కాబట్టి అది అవాంఛనీయమనేది మరొక బలమైన వాదన. అనైక్యత తలెత్తే అవకాశం ఉన్నమాట వాస్తవమే. అది అవాంఛనీయమనేది కూడా వాస్తవమే. అనైక్యత తలెత్తకుండా చూడటం అవసరం. అది కేవలం దళితుల బాధ్యత, దళిత సంఘాల బాధ్యత మాత్రమే కాదు, ప్రజాతంత్రవాదులందరి బాధ్యత. కానీ దానికి మార్గం ఏమిటి? తమ వాటా తమకు న్యాయంగా ఇమ్మని అడిగేవాళ్ళ కోరికను తిరస్కరించడమా? లేకపోతే ఆ కోరికను సహృదయంగా స్వీకరించి ఐక్యత దెబ్బ తినకుండా కాపాడుకోవడమా? తాము అసమానులమని గుర్తించనంతవరకే అసమానుల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది. గుర్తించాక మాత్రం సమానత్వ కాంక్షను గౌరవించి ఐక్యతను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. కె.బాలగోపాల్ ఎస్.సి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య సున్నితమైన అంశం అని సోకాల్డ్ మేధావులు, రచయితలు మిన్నకుండిపోతున్న సమయంలో వారు తమ వైఖరి మార్చుకోవాలని, కుల నిర్మూలనకు రిజర్వేషన్ల వర్గీకరణ ఏ మాత్రం అడ్డంకి కాదని బాలగోపాల్ నిక్కచ్చిగా చెప్పారు. ఎస్.సి వర్గీకరణ జరిగితేనే అట్టడుగు వర్గం వారికి మరింత బలం చేకూరి వారు పురోగతిని సాధించగలరనే సత్యాన్ని బాలగోపాల్ పదే పదే చెప్పారు. ఇదే ఆయన ప్రత్యేకత.

Browse more Telugu books