రాబిన్సన్ క్రూసో / ROBINSON CRUSOE

సొదుం రామ్మోహన్ / Sodum Rammohan · Novels

రాబిన్సన్ క్రూసో / ROBINSON CRUSOE book cover

Price: Rs. 112. చిన్న దీవి. చెట్టు దిగితే మింగే క్రూరమృగాలు. ఎటు చూసినా అంతులేని సముద్రం. నరమానవుడు తోడులేని జీవితం. తల్చుకుంటేనే గుండెలు గుబేలుమంటాయి. ఆ నిర్జన దీవిలో రాబిన్సన్ క్రూసో బతికి బట్టకట్టాడు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం అతను నిరాశకు గురి కాలేదు. అధైర్యపడి ఆశ విడిచి పెట్టలేదు. తన ప్రయత్నం మానలేదు. తన వివేకంతో లోకజ్ఞానంతో సమయస్ఫూర్తితో సాహసంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. జ్ఞానాన్ని వాస్తవ పరిస్థితులకు అన్వయించడం అంటే ఏమిటో ఈ కథ తెలియజేస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎంత నిబ్బరంగా అధిగమించాలో ఈ కథ నేర్పుతుంది. ఈ నవలలో అడుగడుగునా కన్పించే అంశాలు అన్వేషణాస్పూర్తి, సాహసం, తెగువ, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై చెరగని ఆశ. ఇవే క్రూసో ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు, నైపుణ్యాలు అన్నీ ఏ తరం బాలబాలికలైనా సంతరించుకోతగినవే. ఈ నవల పిల్లల మనస్సులను అన్వేషణాస్ఫూర్తితో ప్రజ్వలింపచేస్తుంది. వాళ్లలో చైతన్యాన్నీ, ఉత్తేజాన్నీ నింపుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి అవసరమైన ఆశావాద దృక్పథాన్నీ వివేకాన్నీ ప్రసాదిస్తుంది. ఒక్క మాట, రాబిన్ ్సన్ క్రూసో నుంచి నేర్చుకో కూడని అంశాలూ ఉన్నాయి. చదవండి మీకే తెలుస్తుంది.

Browse more Telugu books