రాజ్యం-సంక్షేమం /(Rajyam - samkshemam)

కె.బాలగోపాల్ · Politics

రాజ్యం-సంక్షేమం /(Rajyam - samkshemam) book cover

Price: Rs. 95. సంక్షేమ రాజ్యమనేది ఏదో ఒక వర్గరాజ్యం, వర్గపరిపాలన, వాళ్ళు బూటకంగా ప్రవేశపెట్టినటువంటి ఒక మేలిముసుగు అంటే ఏం ప్రయోజనం లేదు. ఆదొక నాగరికతా విలువగా, ప్రపంచ నాగరికతలో భాగంగా, రాజ్యానికి - దండ ప్రయోగం మాత్రమే. బాధ్యతగా ఉన్న రాజ్యానికి - కాలక్రమంలో వచ్చినటువంటి కొత్త బాధ్యతలలో భాగంగా వచ్చింది. అనేక రకాల అసమానతలతో బాధపడుతున్న మూడవ ప్రపంచదేశాలలో ఆ అసమానతలను తొలగించడం అనే ముఖ్యమైన బాధ్యతగా ఈ సంక్షేమ బాధ్యత వచ్చింది. అదొక కాలక్రమంలో వచ్చింది. పోరాటాల ఫలితంగా వచ్చింది. ఉద్యమాల ఫలితంగా వచ్చింది. ప్రజాతంత్ర శక్తుల ఆకాంక్షల ఫలితంగా వచ్చింది. పరిపాలకులు దానిని ఎందుకోసం వాడుకున్నారు? దానిని బూటకంగా వాడుకునే ప్రయత్నం చేశారనేది వేరే సంగతి. దానంతటదే సంక్షేమమనేది ఒక విలువ - అది బూటకం కాదు. అది మేలిముసుగు కాదు. పరిపాలనా వ్యవస్థకు సమాజం పట్ల ఉండే బాధ్యత - రూల్ ఆఫ్ లా లాగా ఒక పాజిటివ్ విలువ.

Browse more Telugu books