రాజ్యం మతం కులం /State Religion Caste

కె. బాలగోపాల్/K.Balagopal · Caste, Religion & Culture

రాజ్యం మతం కులం /State Religion Caste book cover

Price: Rs. 45. “ భారతదేశంలో లౌకికవాదం అంటే కులాన్ని వ్యతిరేకించడం; లౌకికవాదాన్ని కాపాడుకోవడమంటే వర్ణధర్మాన్ని, వర్ణవ్యవస్థను, కులవ్యవస్థను, కుల ఆధిక్యతను వ్యతిరేకించడం. అదీ లౌకికవాదాన్ని కాపాడుకోవడమంటే, లౌకికవాదాన్ని నిలబెట్టుకోవడమంటే. ఇవ్వాళ ఆ భారతీయ సంప్రదాయం భారతీయత అనే పేరు మీద బహిరంగంగా ముందుకు వచ్చింది. ఒక్క భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్ వాళ్ళు మాత్రమే కాదు, మొత్తంగా దేశంలో అధికారంలో ఉండేవాళ్ళు, ఆధిపత్యంలో ఉండే వాళ్ళందరూ కూడ తమ అధికారాన్ని, తమ ఆధిపత్యాన్ని, తమ సంపదను, తమ పెత్తనాన్ని నిలబెట్టుకోవడానికి ఇవ్వాళ అది తప్ప వేరే మార్గమేమీ లేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్క భారతీయ వర్ణధర్మం మాత్రమే సమాజంలో ఎవరికి కేటాయించిన స్థానంలో వాళ్ళను సంతృప్తిగా పడి ఉండమని చెపుతుంది. ఇంతకంటే మెరుగైన జీవితం కోరుకోవద్దు, హక్కులు కోరుకోవద్దు అని చెప్పే ధర్మం అదే కాబట్టి మన ఆధిపత్యాన్ని, మన సంపదను, మన అధికారాన్ని, మన పెత్తనాన్ని కాపాడుకోవడానికి భారతీయ సంప్రదాయమే సరయినది అని చెప్పి ఇవ్వాళ అనుకుంటున్నారు. అందువల్ల ఇవ్వాళ మతానికి రాజ్యానికి మధ్య ఉండే సంబంధం గురించి మాట్లాడుతున్నామంటే భారత సామాజిక వ్యవస్థలోను, భారత రాజకీయ వ్యవస్థలోను మతం నిర్వహిస్తున్న పాత్ర, హైందవ మతం పేరు మీద వర్ణధర్మం నిర్వహిస్తున్న పాత్ర, దానిని గుర్తించడం, దానిపట్ల అప్రమత్తంగా ఉండటం, దానిని వ్యతిరేకించడం అందులో చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. కేవలం మూఢనమ్మకాలను విశ్వసించడం మాత్రమే మతం కాదు. "

Browse more Telugu books