రాజకీయాలలో మహిళలు / Women in Politics
షేక్ హసీన / Sheikh Hasina · Politics

Price: Rs. 95. మనది ప్రజాస్వామిక దేశం. మనదేశంలో రాజకీయాలు అత్యంత ప్రభావితమైన పాత్రను పోషిస్తాయి. క్రమం తప్ప కుండా జరిగే ఎన్నికలలో ప్రధాన రాజకీయ పక్షాలే అధికారం లోకి వస్తుంటాయి. ఈ రాజకీయ పక్షాలకు దేశ భవిష్యత్తును నిర్దేశించే అధికారం లభిస్తుంది. దేశ జనాభాలో సగభాగమున్న మహిళలు వర్తమానం, భవితను ప్రభావితం చేసే రాజకీయాల్ని, రాజకీయ పార్టీల తీరుతెన్నులను ఖచ్చితంగా అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళపై వుంది. అయితే ఎంతమంది మహిళలు రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు ? మహిళలకు రాజకీయాలపై అవగాహన కల్పించడంలో వ్యవస్థ, ప్రభుత్వాలు, నాయకులు ఎంతవరకు సఫలీకృతం చెందారో అన్న అంశాన్ని పక్కన పెడితే, వర్తమాన రాజకీయాలపట్ల మహిళల్లో క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. గతంలోకంటే మెరుగ్గా శాసనసభ, పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. జయాపజయాలకు అతీతంగా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా భరించడా నికి సిద్ధమవుతున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాలు, గ్రామాలుగా మారాయి. పోటీతత్వం విపరీతంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితులలో అభివృద్ధి అన్నది ముఖ్యం. దేశరక్షణ, దేశ సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. రాజకీయాలలో స్త్రీలప్రాతినిధ్యం పెరిగే కొద్ది సామాజిక పరివర్తన సులభతరమౌతుంది. రాజకీయాల్ని సజావుగా నిర్వహించడంలో మహిళలే సఫలీకృతం కాగలరు. కుటుంబ బాధ్యతతోపాటు, మన సంస్కృతిని, విలువల్ని, సంప్రదాయాల్ని పురుషులకన్నా ఎక్కువగా మహిళలే కాపాడుతున్నారు. అగమ్య గోచరంగా మారిన రాజకీయ పరిస్థితులను చక్కదిద్దే సత్తా మహిళలకుంది. దేశ భవితవ్యం మహిళా ప్రసక్తి లేకుండా సాధ్యంకావు. రేపటి సమాజ వికాసం నేటి మహిళల ఉన్నతిపైనే ఆధారపడి వుంది కాబట్టి మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంలో రాజకీయా పార్టీలు పూనుకోవాలి. దేశ జనాభాలో మొత్తం ఓటర్లలో 49 శాతం అయిన స్త్రీలు ఏ పార్టీవైపు మొగ్గు చూపితే, ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. రాజకీయ పార్టీలు, నేతలు మహిళా లోకాన్ని మభ్యపెట్టి, మోసగించి ఎంతోకాలం మనుగడ సాగించలేవన్న విషయాన్ని ప్రతి స్త్రీ ఆకలింపు చేసుకోవాలి. అదేవిధంగా అన్ని రంగాలతోపాటు రాజక