రాగ మోహనం / Raga Mohanam
K. Harnath / కె. హరనాథ్ · Stories & Poetry

Price: Rs. 105. ప్రేమ నిప్పులాంటిది. నిప్పు కాలుస్తుంది. ప్రేమ కూడా అంతే. దాన్ని ఆస్వాదించడానికి మంచులా కరిగించి కరిగిపోయే హృదయం ఉండాలి. ఆధునిక టెక్నాలజీ ప్రేమ నిర్వచనాన్నే మార్చేస్తున్నది. ఉన్నతమైన ఆదర్శవంతమైన ప్రేమ భావనను ఫేస్బుక్లలు, వాట్సప్‌లు తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రేమను ప్రేమగా ప్రేమించడం తెలియని నేటి యువత తాత్కాలికమైన ఆకర్షణే ప్రేమ అని భ్రమపడి ఆ భ్రమనే ప్రేమోన్మాదంగా మార్చుకుని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల యాసిడ్ దాడులు, కత్తిపోట్లు, ఆత్మహత్యల వంటి భయానకమైన వాతావరణం సృష్టించబడుతున్నది. One side love మరెన్నో వికృత చేష్టలకు కారణం అవుతున్నది. నిజమైన ప్రేమ భావన అనేది షేక్స్ పియర్ అన్నట్టు "A thing of beauty is a joy for ever', అందాన్ని చూసి ఆనందించాలి కానీ ఎలాగైనా స్వంతం చేసుకోవాలనే ఆలోచనల్ని మనసులోకి రానివ్వవద్దు. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం అనేది గొప్పవరం. ఆ వరాన్ని సాధించడానికి ప్రేమను ఆరాధించండి. ప్రేమను వరంగా పొందాలి.