రాకెట్ కథ / Rocket Katha
V. Srinivasa Chakravarthy / వి. శ్రీనివాస చక్రవర్తి. · Education & Science

Price: Rs. 198. చందమామని అందుకోవాలనీ చుక్కలని అక్కున చేర్చుకోవాలనీ మనిషి ఏనాటి నుంచో కలలు కంటున్నాడు. ఆ ఆశ తీర్చే వాహనం రాకెట్. మొదట మనిషి ఉత్సవాల్లో బాణ సంచాలుగా రాకెట్లని ఎగరేశాడు. తర్వాత యుద్ధాల్లో క్షిపణులుగా ప్రయోగించాడు. అయితే అంతరిక్షంలోకి ప్రవేశించాలన్నా చంద్రుడిపై అడుగుపెట్టాలన్నా అంగారకుని చేరుకోవాలన్న భూమి గురత్వాకర్షణని అధిగమించాలి. అందుకు శాస్త్రపరంగా తొలి అడుగులు వేసిన త్రిమూర్తులు: త్సియాల్కోవస్కీ (రష్యా), గొడార్డ్ (అమెరికా), ఓబర్త్ (జర్మనీ) రాకెట్ రంగంలో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య తలెత్తిన పోటీ ఆ రంగంలో రెండు దేశాలూ అద్భుతమైన ప్రగతిని సాధించడానికి తోడ్పడింది. భారత్ కూడా తొలుత సోవియట్ సహకారంతోనూ, పిదప స్వయం కృషితోనూ ఆకాశాన్ని అందుకొంది. నిన్నటి మనిషి ప్రయాసలు, నేటి విజయాలు, రేపటి కలలు - వాటి గాథే రాకెట్ కథ.