యాజ్ఞవల్క్య / Yajnavalkya
వేలూరి కృష్ణమూర్తి / VELOORI KRISHNA MOORTHY · Novels

Price: Rs. 135. యాజ్ఞవల్క్య' వచన ప్రబంధాన్ని నేను రెండు రోజులలో సుమారు ఆరు గంటల కాలంలో సమగ్రంగా పరిశీలించాను. దీనినిబట్టి నాకవగతమైన విషయం ఏమిటంటే రచనలో చదివించే గుణం ఎంత గొప్పగా ఉన్నది అనేది. విషయ గ్రహణం, రచనా ప్రణాళికా మొదలైన అంశాలు మూల గ్రంథకారులవే అయినా నిర్వహణ విషయంలో శ్రీ వేలూరి కృష్ణమూర్తి గారు తమ ప్రజ్ఞను చక్కగా వినియోగించారు. యాజ్ఞవల్క్యులు బ్రహ్మవేత్త. 'బ్రహ్మవిద్య్రహ్మైవ భవతి' అని ఆర్ష వాక్కు వారి బ్రహ్మవేత్తృతను ఈ గ్రంథాధ్యయనం ద్వారా అధిగమించినవారు (హృదయంలోనికి చొప్పించుకొన్నవారు) మహా ప్రయెజనం తప్పక పొందుతారు. మన సంప్రదాయంలో జ్ఞానము, విజ్ఞానము అని రెండంశాలున్నాయి. మొదటిది పరమాత్మకు, రెండవది ప్రపంచానికి సంబంధించినవి. పారిభాషికంగా రెండవదానిని అవిద్య అనీ, మొదటి దానిని విద్య అనీ అంటారు. 'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృత మశ్నుతే' అంటున్నది ఉపనిషత్తు. అవిద్యతో మృత్యుతరణం అంటే, అజ్ఞానాన్ని రూపుమాపుకోవటం. విద్యతో అమృతం అనుభవించటం అంటే, బ్రహ్మానందం పొందటం. యాజ్ఞవల్క్యులవారు విద్యావిద్యలలో ఎలా ప్రవర్తించారు? అమృతత్వ స్థితిని ఎలా పొందారు? అనే విషయాలు రెండూ ఈ ప్రబంధంలో వెలుగులను నింపుతున్నాయి. సామాన్యులకు మార్గదర్శకాలవుతున్నాయి. కనుక ఈ గ్రంథాధ్యయనం గొప్పగా ప్రయోజనకరం అవుతుంది.