మోడీ పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం / Modi Palanalo Prajaswamya Vidhwamsam

ఎన్.మధుకర్ / N. Madhukar · Politics

మోడీ పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం / Modi Palanalo Prajaswamya Vidhwamsam book cover

Price: Rs. 55. బిజెపి-ఆర్ఎస్ఎస్ కూటమి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి, పరిపాలనా వ్యవస్థకి మధ్య ఉన్న వ్యత్యాసం చెరిగిపోయింది. పార్టీయే (బిజెపి) ప్రభుత్వం - ప్రభుత్వమే పార్టీగా మారిపోయింది. ఎలక్టోరల్ బాండ్లు, పీఎం ఫండ్ దీనికి ఉదాహరణలు. నరేంద్ర మోడీ బిజెపి అధినేతగానే ప్రవర్తిస్తాడు గానీ ప్రధానమంత్రిగా బాధ్యతగా వ్యవహరించడు. దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలపై ఏమాత్రం స్పందించకుండా వాటితో తనకేమీ సంబంధంలేనట్లు మౌనం వహిస్తాడు. తనని తాను దైవాంశ సంభూతుడిగా భావిస్తూ అమాయక జనాన్ని అంధభక్తులుగా మార్చుకుని నియంతగా రూపాంతరం చెందాడు. గత పదేళ్ల కాలంలో దేశం అన్ని రంగాల్లో దిగజారిపోయింది. అంబానీ, అదానీలకు దేశ సంపదను ముట్టజెప్పేందుకు దేశ ఆర్థిక వ్యవస్థను అగమ్యగోచరం చేశాడు. హిందుత్వ భావజాలంతో భారతీయ సమాజాన్ని మతపరంగా విభజించి విషపూరితం చేశాడు. నియంతృత్వ పోకడతో సమాజంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లేకుండా చేశాడు. పాలనా వ్యవస్థలు, మీడియాను తన పెంపుడు కుక్కలుగా మార్చుకున్నాడు. మొత్తంగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను విధ్వంసం చేసి రాజ్యాంగాన్ని అభాసుపాలు చేశాడు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి-ఆర్ఎస్ఎస్ కూటమిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని సంరక్షించుకోడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోడానికి ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్య లౌకికవాదులు, వామపక్ష శక్తులు సంసిద్ధంగా ముందుకు సాగాలి. 'మోడీ పాలనలో ప్రజాస్వామ్యం విధ్వంసం' అనే ఈ సంకలనంలో వివిధ అంశాలపై ప్రముఖులు రాసిన వ్యాసాలను మీకు అందిస్తున్నాము. ఈ వ్యాసాలు ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర, నవతెలంగాణ, ప్రజాపక్షం దినపత్రికల నుండి సేకరించాము. వ్యాస రచయితలకు కృతజ్ఞతలు. ఎప్పటిలాగానే ఈ పుస్తకాన్ని మీరు ఆదరిస్తారని భావిస్తూ....

Browse more Telugu books