మోంబత్తి / Mombatthi
కె.హరనాథ్ / K . Haranath · Stories & Poetry

Price: Rs. 95. హరనాథ్ యువ కవేం కాదు. నలభై యేళ్ళ బట్టి ఆయనలో కవితానది ప్రవహిస్తూనే ఉంది. ఈ నదీ పరివాహక ప్రాంతమంతా సేద్యానుకూలమైందే. సస్యశ్యామలమైందే. ఆయన తొలినాళ్ళ నుంచి కవనరేఖలు దిద్దుకుంటూ భేరీలు మ్రోగించుకుంటూ నగ్నసత్యాల హెూరును అక్షరాల్లో ఇముడుస్తూ స్వరతంత్రుల్ని మీటుకుంటూ కవనాగ్ని కణాల్లో స్వర్ణపుష్పాల కవితాలతల ఆభరణాలను తయారుచేస్తున్నాడు. హరనాథునిలో ఆర్ద్రత ఉంది. అంతకుమించి స్పందించే తీవ్రత ఉంది. ప్రజల పక్షం వహించి ప్రతిఘటించే సాహసముంది. అన్నింటికి మించి ప్రేమించే హృదయముంది. 'మోంబత్తి'లా కాలుతూ నలుగురికి వెలుగునిచ్చే హృదయముంది. హరనాథ్ నాకు ఆత్మీయుడు, ఏం రాసినా అతిశయోక్తే అవుతుంది. 'మోంబత్తి' కవితాసంపుటి పేరు హైదరాబాదు తెలుగు భాషాపదం. మోంబత్తంటే కొవ్వొత్తి, కొవ్వొత్తి పదం కన్నా మోంబత్తి పదమే ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుతుంది. ఈ ప్రత్యేకతను చాటుకునే భాషతోనే 'మోంబత్తి' కవిత్వముందేమోనని ఎక్కడా వెతకకండి.