మైదానం / Maidanam

chalam / చలం · Novels

మైదానం / Maidanam book cover

Price: Rs. 99. "తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంగారిది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. 1927లో వ్రాసిన ఈ నవల పాఠకులను అత్యధికంగా ఆకర్షించింది. చలం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే నవల "మైదానం” ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నవలల పోటీ పెడితే విశ్వనాథ సత్యనారాయణ గారి “వేయిపడగలు," అడవి బాపిరాజు గారి “నారాయణరావు” పరిశీలనకు వెళ్లాయి. తనకు బహుమతి రాదని తెలిసి కూడా, నిష్టాపరులైన బహుమతి నిర్నేతలను చదివేటట్లు చేయడానికి ఈ నవలను పోటీకి పంపాను... అని చలం గారు అన్నారు. ఈ నవలకు పాఠక లోకంలో కీర్తి అపకీర్తి రెండు సమానంగానే వచ్చాయి. పాఠకులకు షాక్ ఇవ్వడం చలం ముఖ్య రచనాగుణం. ఆయన అన్ని రచనల్లోనూ ఈ గుణమే కనిపిస్తుంది.

Browse more Telugu books