మైకెలాంజిలో / MICHELANGELO

వి.శ్రీనివాస చక్రవర్తి / V. Srinivasa Chakravarthi. · History

మైకెలాంజిలో / MICHELANGELO book cover

Price: Rs. 65. మైకెలాంజిలో అన్నది మేధో ప్రపంచానికి సుపరిచితమైన పేరే, ఇక, కళా రంగంలోనయితే, అత్యంత ప్రియమైన పేర్లలో అదొకటి. ప్రపంచానికి ఇటలీ అందించిన ఇద్దరు మహా కళాకరుల్లో ఒకరు మైకెలాంజిలో, ఆయన క్రీ.శ 1475లో పుట్టాడు. తన 89వ ఏట 1664లో చనిపోయాడు. ఆయన శిల్పి, చిత్రకారుడు. కవి, అన్నిటా ఆయన దిట్టే. దైవం అంటే ఏమిటి? కళ ద్వారా కళాకారుడు ఆవిష్కరించే సౌందర్యమే దైవం అన్నది మైకెలాంజిలో భావన, ఆయన అద్భుతమైన చిత్రకారుడు.. అయినప్పటికీ, చిత్ర కళ కంటే శిల్ప కళను ఎక్కువ అభిమానించేవాడు. శిల్పాన్నే ప్రమాణంగా తీసుకోవాలి అన్నది ఆయన నమ్మకం, "శిల్పానికి సన్నిహితంగా వచ్చే చిత్రాన్ని అభిమానిస్తాను, చిత్రానికి సన్నిహితంగా వచ్చే శిల్పాన్ని అసహ్యించుకుంటాను" అనేవాడట మైకెలాంజిలో, ఇది మరో మహా కళాకరుడైన లియొనార్డో ద విందీ భావనకు భిన్నమే కాక విరుద్ధం.

Browse more Telugu books