మేరా బాప్ ఖయ్యూం / Mera Bap Khayyum
హుమాయున్ సంఘీర్ / Humayun Sanghir · Books

Price: Rs. 207. ఇవ్వాళటి బాధ్యతయుతమైన ముస్లిం యువతరం ఆలోచనలకు, వారి సాహితీ ప్రతిస్పందనలకు ప్రతినిధి హుమాయున్ సంఘీర్ 15 కథల ఈ సంపుటిలో మెజారిటీ కథలు మైనారిటీల గురించి ఉన్నాయి. మిగతా వాటిలో దుర్మార్గమైన విభజన రాజకీయాలు, సామాజిక చింతనాతాత్వికత, కులోన్మాదానికి బలవుతున్న ప్రేమను, ప్రేమించే మనుషులను చిత్రించాడు. అవును. ఈ కథలు చదువుతూ ఉంటే వాస్తవ ఘటనలు బ్యాక్గ్రౌండ్లో కండ్ల ముందు కదలాడుతుంటాయి. కర్తవ్యాన్ని బోధిస్తూ ఉంటాయి. రోజూ పత్రికల్లో కథనాలుగా, వార్తలుగా, హృదయవిదారకంగా పరుచుకుంటున్న వాస్తవాంశాలను ఆ ఒక్క రోజుకే పరిమితం గాకుండా వాటికి చరిత్రలో శాశ్వత స్థానం కల్పించి, పాఠకుడిని విద్వేషపు ఆలోచనల్లోంచి బయటపడేసి ప్రేమ వైపు మళ్లించడాన్ని స్వీయ బాధ్యతగా స్వీకరించి సంఘీర్ నిర్వర్తించిండు. ఈ అవసరమైన పనిని అరుంధతి రాయ్, రానా అయూబ్, ఆకార్ పటేల్, శశిథరూర్ లాంటి హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు నవలల ద్వారా చేస్తే దాదాపు అలాంటి పనినే సంఘీర్ కథల ద్వారా చేస్తున్నడు. హిందూ 'ముస్లిం సమాజాల మధ్యన కొత్త వంతెనలను మజ్బూత్గా నిర్మించే ప్రయత్నంలో భాగమిది.