మృతజీవులు / MRUTHA JEEVULU
ఎ . గాంధీ / A .GANDHI · Novels

Price: Rs. 135. మృతజీవులు రష్యన్ భాషలో తొలి ఆధునిక నవల. మొదటి భాగం 1846లో వెలువడింది. రచయిత గొగోల్. రష్యన్ విప్లవానికి సుమారు ఏడు దశాబ్దాలకి ముందు రాసిన నవల ఇది. కొద్దిగా హాస్యాన్ని, మరికొంత ఆగ్రహాన్ని, దండిగా వ్యంగ్యాన్ని తీసుకొని అవి బాగా కలవడం కోసం గొగోల్ బీభత్స రసాన్ని పోశాడనిపిస్తుంది. ఇందులో హీరోలు లేరు. కన్యాశుల్కంలో ప్రధాన పాత్రధారి గిరీశం హీరో కానట్టే, మృతజీవులులో ప్రధాన పాత్రధారి చిచీకప్ కూడా హీరో కాదు. అయితే మనవాళ్లు గురజాడను 'సంస్కరించి' గిరీశాన్ని హీరో చేసేశారు. రష్యాలో చిచీకవ్కు అలాంటి అదృష్టం పట్టలేదు. ఈ నవలలో ప్రత్యేకించి ఏ వ్యక్తినీ విలన్ అని చెప్పడానికీ వీలుండదు. కాని పరిస్థితులు మాత్రం దారుణంగా అన్యాయంగా అడ్డగోలుగా ఉంటాయి. ఈ వ్యవస్థ వల్ల సర్వనాశనం అయిపోతున్న సామాన్యులు ఈ నవలలో మనకి పెద్దగా కనిపించరు. అంతా పై వర్గాలవాళ్లే. అందులో సజ్జనులూ ఉంటారు. అయినా ప్రయోజనం ఉండదు.