మృచ్ఛకటికం/ Mrichakatikam

జి. ఎస్. చలం / G.S.CHALAM · Novels

మృచ్ఛకటికం/ Mrichakatikam book cover

Price: Rs. 108. ఆధునిక లక్షణాలు పుష్కలంగా ఉన్న ప్రాచీన సంస్కృత నాటకం మృచ్ఛకటికం. కవి శూద్రకుడు. కథ అవంతి రాజ్య రాజధాని నగరం ఉజ్జయనిలో జరుగుతుంది. రాజు పాలకుడు. పరమ దుష్టుడు. కథా నాయకుడు చారుదత్తుడు. ఉత్తముడు. కళాభిమాని. అడిగినవారికి లేదనకుండా దానాలు చేసి పేదవాడు అవుతాడు. కథానాయిక వసంత సేన వేశ్య. అపురూప సౌందర్యరాశి. సంపన్నురాలు, సంస్కారి. చారుదత్తుని గుణగణాల గురించి విని అతనిని గాఢంగా ప్రేమిస్తుంది. రాజు బావమరిది శకారుడు అధికార మదంతో విర్రవీగుతూ తనను వరించమని ఆమెని సతాయిస్తాడు. ఆమె ససేమిరా అంటుంది. దాన్ని తట్టుకోలేక, వసంతసేనను చంపి ఆ నేరాన్ని చారుదత్తునిపై మోపుతాడు. చారుదత్తునికి మరణ శిక్ష పడుతుంది. మరోవైపు రాజు అరాచక పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది. తిరుగుబాటు నాయకుడు ఆర్యకుడు. ప్రజాభిమానంతో విజయం సాధిస్తాడు. పాలకుడవుతాడు. చివరికి కథ ఎలా సుఖాంతం అవుతుందో మీరే చదివి తెలుసుకోండి. రాగద్వేషాలతో రంగురంగుల మనుషుల మనోవైచిత్రికిది నిలువుటద్దం. ఊహించని మలుపులతో రంగరంగాలుగా సాగే సామాజిక దర్పణం.

Browse more Telugu books