మా భూమి / MAA BHOOMI

సుంకర సత్యనారాయణ & వాసిరెడ్డి భాస్కరరావు / Sunkara Satyanarayana & Vasireddy Bhaskara Rao · Literature

మా భూమి / MAA BHOOMI book cover

Price: Rs. 65. "మా భూమి చదివాను. రచయితలకు నా ధన్యవాదాలు. తెలంగాణా ప్రజల వాస్తవిక స్థితిని ఎంతో చక్కగా చిత్రించారు. ఆంధ్రభాషలో ఇది ఉత్తమోత్తమ నాటకంగా ఉంటుంది. ఆంధ్రప్రజలను, ముక్కోటి ఆంధ్రులను ఐక్యపరిచే నాటకంగా ఉంటుంది. తెలంగాణా ప్రజల పోరాటానికి చేయూత నివ్వడానికి మద్రాసు ఆంధ్రులను ఉర్రూతలూగించే నాటకం. హిందూ-ముస్లిం ఐక్యత, ప్రజాపోరాటాల్లో స్త్రీలు ముందంజ వేయడం, సామాన్యజనం -గొల్ల యల్లమంద, మంగలి రాముడు నూతన జీవితాన్ని నిర్మించుకోడానికి ముందుకు రావడం - ఇది అంతా కండ్లకు గట్టినట్లు వాస్తవికతను చిత్రించారు. ఇది చదువుతూ ఉన్నప్పుడు సోవియట్ నాటకాలను చదివినప్పుడెంత సంతోషించానో అంతకన్న ఎక్కువ సంతోషం పొందాను. కడకు మన తెలుగులో కూడా ప్రజల వాస్తవిక జీవిత చిత్రాన్ని అప్పటి లాగానే రాయగలిగినామని సంతృప్తి కలిగింది.

Browse more Telugu books