మాషా / Masha
మోహన్ తలారి / Mohan Talari · Novels

Price: Rs. 135. ఇలాంటి ఒక కథ 200 ఏళ్ల కింద రాయబడిందని తెలిసి ఆశ్చర్య పోయాను. పైకి కనిపించేది వేరు, పుష్కిన్ చెప్పాలనుకున్నది వేరూ అని చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. విలన్ అనుకుంటున్న పాత్ర నిజంగా చెడ్డదా?. ప్రభుత్వాన్ని ఎదిరించే ఓ తిరుగుబాటుదారుడి ఆలోచన, ప్రవర్తన, ఇతర పౌరుల మీద అతనికి ఉండే దయ... నిజాయితీకీ, విశ్వసనీయతకి ఇచ్చే విలువ నిజమైన ఆనాటి మనిషిని మళ్లీ మనకు పరిచయం చేసినట్టుగా అనిపిస్తుంది. ఆనాటి జారిస్టు ప్రభువుల అణచివేతలో జరిగిన నిజమైన సంఘటనలే ఇట్లా పుస్తకంగా మారటమే ఒక అద్భుతం. రాజకీయ కుట్రలని చెబుతూనే ప్రేమలో స్వేచ్ఛనీ గుర్తు చేయడం, ఒక ఆడపిల్లకి సమాజంలో గౌరవం ఎలా ఇవ్వాలో చెప్పిన తీరు. యుద్ధం, తిరుగుబాట్లలో కూడా పాటించాల్సిన వ్యక్తిగత విలువల అవసరాన్నీ గుర్తు చేస్తాడు పుష్కిన్. ఆఖరి పేజీకి వచ్చిన తరువాత కళ్లు చేమర్చకుండా, కనీసం చిన్న గగుర్పాటు కలగకుండా పుస్తకాన్ని ముగించటం కాస్త కష్టమే. అద్భుతమైన సామెతలూ, జానపదగీతాలూ, కవితలతో కలిపి రాసిన తీరు ఆశ్చర్య పరుస్తాయి. వందల ఏళ్ల తరవాత కూడా ఏమాత్రం విలువ తగ్గని రచన. పాఠకులే కాదు రచయితలూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.