మార్తా / Martha

chalam / చలం · Novels

మార్తా / Martha book cover

Price: Rs. 157. “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తనప్రయాణాన్నంతారచనల్లో కూర్చినవ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. మార్తా ఒక భక్తురాలి కథ. ఒకే నవలగా ఉన్నా ప్రాసంగికంగా “మగ్దలేని మరియ" చెప్పిన ఆత్మకథ సమానాంతరంగా సాగుతుంది. "మార్తా”ది రజోగుణం కల భక్తి. ఆమె సోదరి “మరియ”ది సర్వార్పణం చేసుకున్న సత్వభక్తి. మగ్దలేని మరియది కృతజ్ఞతా పూర్వకమయిన విశ్వాసంతో కూడిన భక్తి, జనం నడయాడే చోట్లంతా తన కారుణ్యాన్ని పరుచుకుంటూ సాగిపోయే మహాపురుషుడు జీసెస్, ఈ మొత్తం చిత్రమే మార్తా నవల. ప్రభువును రేపు శిలువ వేస్తారని తెలిసిన నాటి నుండి శిలువ వేసే వరకు ఈపాత్రలకల్లోల చిత్రణలు ఈరెండుఅధ్యాయాలు.

Browse more Telugu books