మానవాళికి మహోదయం / MANAVALIKI MAHODAYAM

డి. పాపారావు / D.PAPAROA · Literature

మానవాళికి మహోదయం / MANAVALIKI MAHODAYAM book cover

Price: Rs. 360. అమెరికా ప్రపంచ పెట్టుబడిదారీ దోపిడీకి గుండెకాయగా, వెన్నుదన్నుగా వున్న రికా ఆర్థికవ్యవస్థ పునాదులు నేడు కదిలిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి త్వరలోనే రానుందని, ఈ రచయిత గత రెండున్నర దశాబ్దాలుగా వివిధ పత్రికలలో వ్రాసిన వ్యాసాల సంకలనమే "సమాధిలోకి సామ్రాజ్యవాదం" పేరుతో 2012లో ప్రచురించబడి నేడు మరింత Updated గా "మానవాళికి మహోదయం" పేరుతో మీ చేతిలో వున్న ఈ పుస్తకం. నేడు, ప్రపంచమంతటా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల దివాలా క్రమంలో-పెరిగిపోతోన్న-నిరుద్యోగం, పర్యావరణ విధ్వంసం నేపథ్యంలో మానవాళికి సోషలిజమే ఏకైక ప్రత్యామ్నాయం అనేది రచయిత నిర్ధారణ! 2008 ప్రపంచ ఫైనాన్స్ సంక్షోభం అనంతరం నిర్దిష్టంగా వాస్తవ రూపం దాలుస్తోన్న పరిణామాలు రచయిత వాదనలకు తార్కాణం! ఈ పుస్తక రచయిత సంవత్సర కాలం పాటు (1986-87) ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గాను, 1987-94కాలంలో పి.బి. సిద్ధార్థ కళాశాల పి.జి. కేంద్రంలో మేనేజ్మెంట్ అధ్యాపకునిగాను, అనంతరం సాఫ్ట్వేర్ రంగంలో 7 సం.ల పాటు పనిచేశారు. ప్రస్తుతం వామపక్ష భావాలతో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉన్నారు.

Browse more Telugu books