మహద్ / Mahad

Dr. Nirmala Yarlagadda / డాక్టర్ నిర్మల యార్లగడ్డ · History

మహద్ / Mahad book cover

Price: Rs. 95. మహద్ మునిసిపాలిటీ ఆమోదించిన తీర్మానం సహాయంతో మహద్ ఉద్యమానికి సిద్ధం అయింది. 1924 నాటికి అణగారిన వర్గాలకు మహద్ చెరువు ప్రవేశానికి అనుమతినిచ్చి, వారి హక్కును వినియోగించుకోవాలని ప్రకటన చేసింది. ఆ తీర్మానం ఇతర కుల హిందువులతో పాటు అణగారిన వర్గాలను కూడా ఆ చెరువు నుండి నీటిని తీసుకోవడానికి అనుమతించింది. అగ్రవర్ణాలవారు అడ్డు పడతారనే భయంతో అస్పృశ్యులు చెరువును చేరుకొనే ధైర్యం చేయలేకపోయారు. అంటరాని వారిని చెరువుకు తీసుకెళ్ళడానికి నీటిని తీసుకునేందుకు వీరికి సహాయం చెయ్యడానికి మున్సిపాలిటీ గాని, ఏ సవర్ణ హిందువు గాని ముందుకు వచ్చే ధైర్యం చేయలేదు. సమానత్వం కోసం ఒక ఉద్యమానికి నాయకత్వం వహించడానికి కాలం అంబేద్కర్ కోసం వేచి చూసింది. దండి యాత్రకు ఆ అవసరం అంతగా లేదు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎవరికీ కోరికా లేదు అంత అవసరమూ లేదు. అలా చేయడానికి ఎవరూ సిద్ధంగానూ లేరు. మహద్ ఉద్యమానికి బలమైన, అవసరమైన కారణం ఉంది. అంటరానివారు ఊరి చెరువు నుండి నీటిని తీసుకోకుండా నిషేధించే అమానవీయ ఆచారం, అణగారిన ప్రజలను ఎంతగానో బాధించింది. ఇప్పటికీ వారు మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు, దాని కోసం చనిపోతున్నారు. ఇది కేవలం ఉద్యమం కాదు. గొప్ప యుద్ధం. నిషేధిత చట్టం ఉన్నప్పటికీ కూడా దండి మార్చ్ మనుగడ సాగించవచ్చు, కానీ మహద్ ఉద్యమకారులు అమానవీయ చట్టాన్ని ఉల్లంఘించకుండా వారు మనుషులుగా జీవించలేరు. దండి ఒక ప్రతీకాత్మకమైన మార్చ్, కాని మహద్ పోరాటం మాత్రం నేటికీ రుజువు కాబడుతున్న నిజమైన యుద్ధం.

Browse more Telugu books