మనువాదం మహిళా హక్కులు / Humanism Women's Rights
ఎస్. పుణ్యవతి/ S. Punyavati · Caste, Religion & Culture

Price: Rs. 25. నేడు మన దేశం ఒక పెద్ద విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అది మతతత్వ ఆలోచనల, ఆచరణల విధ్వంసం. సమాజం మొత్తాన్ని వెనక్కి నడిపిస్తోంది. ప్రజాస్వామిక, లౌకిక పునాదులను పెకలిస్తోంది. మానవ హక్కులు హరించబడుతున్నాయి. స్వేచ్ఛ, సమానత్వం స్థానంలో మనుధర్మం, కుల అంతరాల స్థిరీకరణ, వివక్షతలు పెరుగుతున్నాయి. ఇవి మహిళలకు మరింత కంటకంగా మారుతున్నవి. స్త్రీలను అణచివేసి, హింసకు గురిచేస్తున్నవి. మనువాదం అసలు ఏం చెబుతున్నది! మహిళల హక్కులను ఎలా నిరాకరిస్తున్నది, ఎన్ని రకాలుగా స్త్రీలు వేధింపులకు గురవుతున్నది. చాలా విపులంగా, సంఘటనల ఆధారంగా వివరిస్తారు ఈ పుస్తకంలో పుణ్యవతిగారు. మహిళా ఉద్యమంలో పనిచేస్తున్నవారు. సామాన్య మహిళలు అందరూ చదవాల్సిన పుస్తకం ఇది.