మద్దూరి నగేష్ బాబు / MADDURI NAGESH BABU
Dr. Khaja ,Dr. Koi Koteswara Rao / డాక్టర్ ఖాజా , డాక్టర్ కోయి కోటేశ్వర రావు · Stories & Poetry

Price: Rs. 900. మద్దూరి నగేష్ బాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రుద్రారం గ్రామంలో 1963 ఆగష్టు 15 నాడు అనసూయమ్మ, జకరయ్య దంపతులకు జన్మించాడు. తల్లి దండ్రులు ఉపాధ్యాయులు. నరసరావు పేట లూథరన్ హైస్కూల్లో 10 వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల (గుంటూరు) లో ఇంటర్, బి.ఎ. డిగ్రీలు పూర్తి చేశాడు. ఆంధ్ర విశ్వ విద్యాలయం (విశాఖ పట్నం)లో ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ చదువుకున్నాడు. 'తెలుగు, మరాఠి దళిత కవిత్వం ఆఫ్రికన్ బ్లాక్ కవిత్వం తులనాత్మక పరిశీలన 'అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం (హైదరాబాద్) యం.ఫిల్ చేశాడు. ఆకాశవాణి కొత్త గూడెం కేంద్రంలో అనౌన్సర్ ఉద్యోగం సంపాదించి, అక్కడ 1993 నుండి 1995 వరకు ఎనౌన్సర్ గా సేవలందించాడు. 1995 లో గ్రూప్2 సర్వీసెస్‌కు ఎంపికై డిప్యూటీ తహసీల్దార్ గా, మండల రెవెన్యూ ఆఫీసర్‌గా, పది సంవత్సరాలపాటు రెవిన్యూశాఖలో సేవలందించాడు. 2005 జనవరి 10 న మరణించాడు. నగేష్ బాబు భార్య మద్దూరి విజయశ్రీ రెవిన్యూ శాఖలో ఉన్నతోద్యోగి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నగేష్ బాబుకు ఇద్దరు కుమార్తెలు శ్రీజ, అస్మిత. వీరిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. వెలివాడ, మీరేవుట్లూ, లోయ, నరలోక ప్రార్థన కవితా సంపుటాలను, రచ్చ బండ, గోదావరి, పుట్ట, దీర్ఘకవితలను వెలువరించాడు. కాస్త సిగ్గు పడదాం, (సంఘీభావ కవిత) విడి ఆకాశం (అంబేద్కరిస్టు ప్రేమ కవిత్వం) కవితా సంపుటాలకు ఖాజాతో కలిసి సంపాదకుడిగా వ్యవహరించాడు. వరదయ్య, పైడి తెరేష్ బాబు, ఖాజాలతో కలిసి నిశాని ధిక్కార కవితను, రాణీ శివశంకర శర్మతో పాటు ఊరూ వాడ (సంకర కవిత)ను వెలువరించాడు. ఐదు కథలు రాశాడు. ఆంధ్రజ్యోతి దినపత్రిక 'నవ్య' పేజీలో స్త్రీల కవిత్వాన్ని సమీక్షిస్తూ కొన్ని వారాల పాటు అనేక వ్యాసాలు రాశాడు.