మంచినీటి సముద్రం / Manchineeti Samudram
వడలి రాధాకృష్ణ / Vadali Radhakrishna · Stories & Poetry

Price: Rs. 135. వడలి రాధాకృష్ణ కథలన్నిట్లో కన్పించే ప్రత్యేకత వాటి పఠనీయత. కథ చదవడం మొదలెడితే నల్లేరుమీద బండిలా చివరి వాక్యం వరకు అనాయాసంగా జారిపోవడం ఖాయం. ఈ కథలన్నీ రచయిత అనుభవాల్లోంచి, సామాజిక పరిశీలనలోంచి, తాత్విక చింతనలోంచి, మేధో మధనంలోంచి పుట్టుకొచ్చిన కథలు కాబట్టి నేల విడిచి సాము చేయవు.. పాఠకులకు ఎన్నో రకాల జీవితాల్లోని చీకటి కోణాల్ని అద్భుతమైన శైలీ విన్యాసంతో పరిచయం చేయడంలో, కొన్నిసార్లు గుండెని తడిమి, మానవత్వాన్ని తట్టిలేపడంలో ఈ రచయిత విజయం సాధించాడనడంలో ఏ రకమైన సందేహమూ లేదు. - సలీం మానవ సంబంధాలలోని వైరుధ్యాలనీ, మంచిచెడులనీ సానుకూలదృష్టితో చిత్రిస్తారు. వడలి రాధాకృష్ణ. మనుషుల్లోని మంచికి పట్టం కడతారు. ఇతివృత్తాల ఎంపికలో కాదు, కథాకథనరీతిలో విలక్షణతని కనబరిచే కౌశలం వడలి రాధాకృష్ణలో ఉంది. కథల ఎత్తుగడలో, నడకలో, ముగింపులో ఒక క్రమం ఉంటుంది. తద్వారా ఈ కథలకు పఠనీయత చేకూరింది. పాఠకుల్లో మానవీయ భావనలు, కరుణాంతరంగం, సంయమన దృష్టి బలపడేందుకు ఉపకరించే కథల సమాహారమిది. - గుడిపాటి