భావ విప్లవ కవిరాజు త్రిపురనేని రామస్వామి / Bhava Viplava Kaviraju Tripuraneni Ramaswamy

సి.వేదవతి / C. Vedavati · Biographies & Auto Biographies

భావ విప్లవ కవిరాజు త్రిపురనేని రామస్వామి / Bhava Viplava Kaviraju Tripuraneni Ramaswamy book cover

Price: Rs. 135. జీవన స్రవంతి అవిచ్ఛిన్నంగా సాగిపోతూనే ఉంటుంది. కాలక్రమంలో, సామాజిక జీవన సరళిలో - ఏవో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. సంస్కృతి, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు మొదలైన వాటిలో అనేక అంతరాలు ఏర్పడుతుంటాయి. కరుడుకట్టుకు పోయిన పాత తరం భావాలు, వర్గ విభేదాలు వంటివి సమాజాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు, న్యాయానికీ సత్యానికీ, మానవతకూ భంగం వాటిల్లే పరిస్థితులు ఏర్పడినప్పుడు పాత కెరటాల స్థానంలో కొత్త కెరటాలు ఎగసిపడి వస్తాయి. కొత్త భావాలతో, ఆలోచనలతో, కర్తవ్యనిష్ఠ కలిగిన, భవిష్యద్రష్టలైన మార్గదర్శకులు కొందరు అవతరిస్తారు. వారిది క్రాంతదర్శనం. తమ కాలానికన్నా చాలాముందుకు వెళ్లి చూడగలిగిన మానవీయ దర్శనం అది. మన దేశంలో 19వ శతాబ్దం చివరి నాటినుండీ, ఇటువంటి నవ వికాసోద్యమం ప్రారంభమై దేశమంతా విస్తరిల్లింది. ముఖ్యంగా మన తెలుగునాట విస్తరించిన మూఢాచారాలని, విశ్వాసాలని ఖండించి, హేతువాదమనే జ్యోతిని వెలిగించి, నిద్రాణమై ఉన్న మానవ జాతిని మేల్కొలిపిన వైతాళికులు ప్రధానంగా చెప్పుకోదగినవారు ముగ్గురున్నారు. వారెవరంటే, వేమన, కందుకూరి, త్రిపురనేని రామస్వామి.

Browse more Telugu books