భారత రాజ్యాంగం / Constitution of India.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ · New Arrivals

భారత రాజ్యాంగం / Constitution of India. book cover

Price: Rs. 730. భారత రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ డా॥ బి.ఆర్. అంబేడ్కర్ చరిత్రాత్మక ప్రసంగం భారత రాజ్యాంగ సభ చర్చలు (కార్యకలాపాలు) సంపుటి-11 23 శుక్రవారం, 25 నవంబరు 1949 58...! రాజ్యాంగ సభ కార్యకలాపాలను ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే- 1946 డిసెంబరు 9న తొలిసారి సమావేశం కాగా, నేటికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పూర్తయ్యాయి. ఈ కాలంలో రాజ్యాంగ సభ మొత్తం 11 సార్లు సమావేశమైంది. ఈ సమావేశాల్లో తొలి ఆరుసార్లు లక్ష్యాల తీర్మానం ఆమోదంతోపాటు ప్రాథమిక హక్కులు, యూనియన్ రాజ్యాంగం, యూనియన్ అధికారాలు, ప్రాంతీయ రాజ్యాంగం, మైనారిటీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై ఏర్పాటైన కమిటీల నివేదికల పరిశీలన చేపట్టింది. అటుపైన 7, 8, 9, 10, 11 సమావేశాలు ముసాయిదా రాజ్యాంగ పరిశీలనకు కేటాయించబడ్డాయి. ఈ 11 రాజ్యాంగ సభ సమావేశాలు మొత్తం 165 రోజులు సడవగా రాజ్యాంగ ముసాయిదా పరిశీలసలోనే 114 రోజులు గడిచాయి. ఇక ముసాయిదా రూపకల్పన కమిటీ విషయానికొస్తే- రాజ్యాంగ సభ 1947 ఆగస్టు 29న ముసాయిదా కమిటీని ఎన్నుకుంది. అనంతరం కమిటీ ఆగస్టు 30న తొలిసారి భేటీ కాగా, ముసాయిదా రాజ్యాంగ రూపకల్పన కృషిలో భాగంగా మొత్తం 141 సార్లు సమావేశమైంది. ముసాయిదా కమిటీ కర్తవ్య నిర్వహణ కోసం రాజ్యాంగ సలహాదారు రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలో 13 షెడ్యూళ్లు, 243 అధికరణాలు ఉన్నాయి. ఆ తర్వాత ముసాయిదా కమిటీ 8 షెడ్యూళ్లు, 315 అధికరణాలతో కూడిన రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభకు సమర్పించింది. దీనిపై పరిశీలన దశ ముగిసే సమయానికి అధికరణాల సంఖ్య 886కు చేరగా, ముసాయిదా రాజ్యాంగం తుదిరూపం ఖరారయ్యే సరికి 8 షెడ్యూళ్లు 395 అధికరణాలు కలిగి ఉంది. ఈ క్రమంలో ముసాయిదా రాజ్యాంగం సవరణ నిమిత్తం 7,635 ప్రతిపాదనలు రాగా, వాటిలో 2,473 సభలో చర్చకు వచ్చాయి.

Browse more Telugu books