భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ / Indian Constitution An Analysis
Dondi Lakshminarayana / దొండి లక్ష్మీనారాయణ · Politics

Price: Rs. 45. భారత రాజ్యాంగాన్ని భారతదేశంలోని పౌరులందరికి చేరువ చేయాలనే ఆశయంతో రాజ్యాంగ అవగాహన అనే వేదికను ఏర్పాటు చేసి రాజ్యాంగంపై నిరంతరం వ్యాసాలు రాస్తూ చైతన్య పరుస్తున్న గురుతుల్యులు శ్రీ దొండి లక్ష్మీ నారాయణగారు ఎంతో శ్రమకోర్చి కొన్ని సంవత్సరాలు పరిశోధించి, ఈ పుస్తకాన్ని ముద్రిస్తున్నందుకు అత్యంత ఆనంద దాయకంగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలను ప్రజలకు మరింత చేరువు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకం ద్వారా భారతదేశ సహజ సంపద దేశ ప్రజలందరిది అనే భావన కలుగుతుందని భావిస్తున్నాను. ప్రపంచంలో ఏ రకమైన ఉపయోగపు వస్తువు తయారు కావాలన్నా ముడి పదార్థం సహజ వనరులే అనీ ఈ సహజ వనరులు కేవలం ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే ఉండాలనీ అప్పుడే దేశంలోని ప్రతి వ్యక్తి సర్వ స్వతంత్రుడిగా ఉండగలుగుతాడు అనే విషయాన్ని ఈ పుస్తకం పఠనం ద్వారా ప్రజలు గ్రహిస్తారని భావిస్తున్నాను. సహజ వనరులకు శ్రమ తోడైతే అది ఉపయోగపు వస్తువుగా మారుతుందనీ ఈ శ్రమలో సాధారణ మేథోనైపుణ్య శ్రమలు ప్రతి మనిషి పొందుటకు లేదా ప్రావీణ్యం/ శిక్షణ పొందడానికి సమాన అవకాశాలు ప్రజలందరికీ ఉండాల్సి ఉంటుందనీ అది కేవలం విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రభుత్వం ద్వారా అందించినప్పుడే సాధ్యమవుతుందని పాఠకులు గ్రహిస్తారు. కులరహిత, వర్గరహిత సమాజం ఏర్పడాలంటే సర్వోదయ పాఠశాలల ద్వారా విద్యాబోధన జరిగినప్పుడే సాధ్యమని, అదే సామ్యవాద విధానం అనే విషయాన్ని పాఠకులు అవగతం చేసుకుంటారని భావిస్తున్నాను. అన్ని రంగాలను ప్రైవేటుపరం చేస్తున్న సమయంలో అన్ని రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సిన ఆవశ్యకతను మన రాజ్యాంగంలోనే డాక్టర్ బీమ్ రావ్ అంబేద్కర్ కల్పించారనే విషయం ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. రాజ్యాంగం ఒక బ్రహ్మ పదార్థం.