భారతీయ తత్త్వశాస్త్రం -3 / Bharathiya Tatvasastram - 3
ముసునూరు శివరామకృష్ణారావు / Musunuru Sivaramakrishna Rao · Books

Price: Rs. 630. భారతీయ తాత్విక చింతనలో పూసిన పూలన్నిటితోనూ ఒక మాలగట్టి మనకు ఇక్కడ అందిస్తారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈశ్వరవాదం నుంచి నిరీశ్వరవాదం వరకూ అన్ని ధోరణలూ ఈ నాలుగు భాగాలలో మీకు దర్శనమిస్తాయి. రుగ్వేద కాలం నుంచి నేటివరకూ సుమారు నాలుగు వేల సంవత్సరాలపాటు ఈ దేశంలో సాగిన తాత్త్విక చింతన గురించిన స్థూల వివరణ ఇది. వేదాలు, ఉపనిషత్తులు, భౌతికవాదం, జైనమతం, బుద్ధధర్మం, బ్రాహ్మణమతం, మనస్మృతి, భగవద్గీత, న్యాయ వైశేషికాలు, ఆరు బ్రాహ్మణ దర్శనాలు, సాంఖ్యం, పతంజలి యోగశాస్త్రం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఈశ్వరవాదంలో ధోరణులు, నిరీశ్వరవాదంలో ధోరణులు, శంకరాద్వైతం, రామానిజుని తత్త్వం, శైవశాక్తేయాది మతాలు, మధ్వాచార్యుడు, వల్లభాచార్యుడు, చైతన్య గోస్వామి తదితరుల తాత్త్విక ధోరణులూ ఈ గ్రంధంలో దర్శనమిస్తాయి. నాలుగు సంపుటాల్లో ఇది మూడోది.