భారతీయుల మూలాలు / Bharateeyula Moolalu
మర్ల విజయకుమార్ / Marla Vijaykumar · History

Price: Rs. 180. వేల ఏళ్ల నుంచీ భారత భూభాగంలోకి అనేక తెగలు వచ్చి చేరాయి. వారిలో ఒకరిద్దరు తప్ప మిగిలినవారంతా ఈ గడ్డని సొంతం చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారు. భారతీయ సంస్కృతికి వైవిధ్యాన్ని చేకూర్చారు. సింధు నాగరికతావాసులు, ద్రావిడులు, ఆర్యులు, యవనులు, తోకారియన్లు, శకులు, హూణులు, పారశీకులు, టర్కులు, మొగలులు - ఒకరా? ఎందరో వచ్చారు. వారు మూలవాసులతోనే కాక, తమలో తాము కూడా ఘర్షణ పడ్డారు. అంతిమంగా భారతీయతను సంతరించుకొన్నారు. చివరిలో వచ్చిన యూరోపియన్లే ఇందుకు మినహాయింపు. భారత దేశం వివిధ జాతుల సంస్కృతుల భాషల అందమైన హరివిల్లు. అందుకు పునాది సింధు నాగరికత అంటారు, రచయిత. మర్ల విజయకుమార్ గారు విశ్రాంత సాంకేతిక నిపుణులు. ఇప్పటికి రుజువైన చారిత్రిక ఆధారాలే కాక పురావస్తు, జన్యుశాస్త్ర పరిశోధనల్లో విలువైన సమాచారానికి రుగ్వేద శ్లోకాల్లోని చారిత్రిక సమాచారాన్ని జోడించి ఈ పుస్తకానికి రూపం ఇచ్చారు. కాదనటానికి వీల్లేని బలమైన సాక్ష్యాలతో, ఈ సమస్యపై చెలరేగుతున్న అనేక వాద వివాదాలను ఆయన సరళమైన భాషలో హేతుబద్ధంగా పరిష్కరించారు.