భగత్ సింగ్ వీలునామా / BHAGAT SINGH VEELUNAAMA
వి.ఆర్ బొమ్మా రెడ్డి / V.R. Bomma Reddy · Biographies & Auto Biographies

Price: Rs. 35. భారత స్వాతంత్ర్య సమరయోధుల్లోనూ, విప్లవ సోషలిస్టులలోనూ అగ్రశ్రేణికి చెందిన వారిలో భగత్సింగ్ ఒకరు. అంతేకాదు, మనదేశంలో మొట్టమొదటి మార్క్సిస్టు సిద్ధాంత ఆలోచనాపరులలో కూడా భగత్ సింగ్ ఒకరు. దురదృష్టవశాత్తూ ఆయన మార్క్సిస్టు దృక్పథాన్ని కలిగివున్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ కారణంగానే భగత్సింగ్కు, చంద్రశేఖర్ అజాద్ లాంటి ఆయన సహచరులకు మనదేశంలో గల బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలను రకరకాల అభివృద్ధి నిరోధకులు, మూఢ విశ్వాసపరులు, మతోన్మాదులూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం, సిద్ధాంతాల కోసం అక్రమంగా ఉపయోగించుకోవడం జరుగుతున్నది.