బ్లాక్ బ్యూటీ / Black Beauty
శ్రీకృష్ణవరప్రసాద్ / Sri Krishna Prasad · Literature

Price: Rs. 65. గుర్రాలను కాసే కుర్రాళ్ల కోసమూ గుర్రాల యజమానుల కోసమూ రాసిన పుస్తకం ఇది. కాని వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా ఆవేళ ఈ పుస్తకాన్ని బ్రిటన్లో ఆబాలగోపాలమూ చదివి ఆనందించింది. ఆ తర్వాత ప్రపంచమంతటా అనేక భాషల్లో వెలువడింది. బ్లాక్ బ్యూటీ అనే ఈ పుస్తకం ప్రపంచ పబ్లిషింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఇంగ్లిషు భాషలోనే ఇంతవరకూ అత్యధికంగా అమ్మిన పుస్తకాల్లో ఇది ఆరోది. అన్నా సెవెల్ రాసిన ఏకైక పుస్తకం ఇది. 'ప్రేమలేని మతం మతం కాదు. తోటి మానవుల్నీ జంతువుల్నీ ప్రేమించడం నేర్పని మతం ఒక బూటకం' అంటుంది అన్నా. చిన్నప్పుడు తన పధ్నాలుగో ఏట స్కూలుకి వెడుతూ పడిపోయిందామె. అప్పటి నుంచీ జీవితాంతం అవిటిగానే బతికింది. ఆమె కేవలం 40 పౌండ్లకే తన నవలను ఒక ప్రచురణకర్తకు అమ్మింది. నవల వెలువడిన తర్వాత ఐదునెలలకే చనిపోయింది.