బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేద్కరిజం / Bouddham Socialism Marxism Ambedkarism

B. S. RAMULU / బి. ఎస్. రాములు · Politics

బౌద్ధం సోషలిజం మార్క్సిజం అంబేద్కరిజం / Bouddham Socialism Marxism Ambedkarism book cover

Price: Rs. 270. బి. ఎస్. రాములు గారు సామాజిక తత్వవేత్తగా రచయితగా సుప్రసిద్ధులు. తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ ఛైర్మన్. వీరిది వినూత్నపథం. బుద్ధుడిని గొప్ప సోషలిస్టుగా చెప్పిన తీరు ఒక నూతన ఆవిష్కరణ. బి.ఎస్. రాములుగారు బౌద్ధ తాత్వికులలో ఆచార్య నాగార్జున, ధర్మకీర్తి, దిగ్నాగుడు, వసుబంధు మొదలైన తాత్వికులను అధ్యయన సారాంశాన్ని ఆధునిక సామాజిక సిద్ధాంతాలను పరిచయం చేస్తారు. విశ్లేషిస్తారు. సంశ్లేషిస్తారు. ఆచరణతో తులనాత్మక సమన్వయం చేస్తారు. బుద్ధిజం, మార్క్సిజం, అంబేద్కరిజం, ఫెమినిజం, మానవతావాదాలను సమన్వయించి ప్రపంచీకరణ యుగంలో ఆధునిక నూతన సిద్ధాంతాలను కర్తవ్యాలను ప్రతిపాదిస్తారు. సమస్త వర్ణ వర్గ కుల లింగ జాతి మత ప్రాంత దేశ భాష వివక్షతలను అసమానతలను తొలగిస్తూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఆత్మగౌరవము సమ సమాజ నిర్మాణం, శాంతియుత పరివర్తన, మెజారిటీ ప్రజలకు రాజకీయాధికారం వీరి లక్ష్యం. సమస్త వివక్షతలను అసమానతలను దోపిడీని అణచివేతను నిర్మూలిస్తూ సామాజిక సాహిత్య సంస్కృతిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో రావాల్సిన మార్పులను ఎలా సాధించు కోవాలో వివరిస్తారు. భారత రాజ్యాంగ విశిష్టతను సంశ్లేషిస్తారు. సామాజిక మార్పు కోసం దారి చూపుతారు. బి.ఎస్. రాములు దేశవ్యాప్తంగా వేలాది ప్రసంగాలు వందలాది వ్యాసాలు... 1992 నుండి దరకమే ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా చేస్తున్న కృషి తెలుగు సమాజాన్ని ఒక మలుపు తిప్పింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా 1996 నుండి పని చేశారు. తెలంగాణ తల్లి రూపకల్పన చేశారు. రెండు వందలకు పైగా కథలు, ఆరు నవలలు... విభిన్న ప్రక్రియల్లో 105కి గ్రంథాలు 300కు పైగా పీఠికలు వెలువరించారు. వీరి రచనలు సిద్ధాంత అధ్యయన తరగతులకు పాఠ్యాం శాలు. విశ్వవిద్యాలయాలకు పాఠ్యగ్రంథాలు. వీరి రచనలపై ఆరు ఎంఫిల్లు, రెండు పిహెచ్ డిలు వెలువడ్డాయి. వీరి 'కథలబడి', 'కథా రచనకు కథకుడి పాఠాలు' వందలాది యువ రచయితలకు మార్గదర్శనం చేశాయి. తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ ఛైర్మన్ గా బీసీ నోట్బుక్ ప్రచురించారు. ఈ గ్రంథం రాజకీయ, సామాజిక,

Browse more Telugu books