బేంబి / BEMBI
Felix Salten / ఫెలిక్స్ జల్తేన్ · Novels

Price: Rs. 135. అప్పుడే కళ్లు తెరిచిన ఆ లేడి పిల్ల పేరు బేంబి. దాని జీవితమే ఈ పుస్తకం. ఈ కథ ఐదారు దశాబ్దాల క్రితం ఆంధ్ర ప్రభసచిత్ర వార పత్రికలో సీరియల్గా వచ్చింది. తెలుగు పాఠక లోకాన్ని అప్పుడది బాగా ఆకట్టుకుంది. అప్పుడు దీనిని తెలుగు చేసిన మహీధర నళినీమోహన్ గారు గాని, బొమ్మలు వేసిన ఆనంద్ గానీ ఇప్పుడు లేరు. కాని వారి కృషి ఇలా మిగిలి ఉంది. రచయిత ఆస్ట్రియా పౌరుడు. పేరు ఫెలిక్స్ జల్తేన్. ఆయన అడవి జంతువుల గురించి అనేక కథలు రాశాడు. వాటిన్నిటిలోనూ ఈ కథ సుప్రసిద్ధం. ఇది పుస్తకంగా మొదటిసారి వెలువడింది 1924లో. అంటే, దాదాపు వందేళ్ల క్రితం అన్నమాట. అనేక ప్రపంచ భాషల్లో ఇది అనువాదమయింది. 1945లో స్విట్జర్లండులో అడవి జంతువులపై అంతర్జాతీయ కథల పోటీ ఒకటి జరిగింది. దానిలో ఈ పుస్తకానికి మొదటి బహుమతి లభించింది. డిస్నీవాళ్లు దీన్ని సినిమాగా తీశారు. స్విట్జర్లండు ఫుట్బాల్ ఆటగాళ్లు ఒక రోలింగ్ కప్ పెట్టుకొని దానికి బేంబి ప్రైజు అని పేరు పెట్టుకొన్నారు. ఇవి ఈ పుస్తకం ప్రసిద్ధికి గుర్తులు. ఇప్పుడు ఆ పుస్తకాన్నే పీకాక్ క్లాసిక్స్ తెలుగు బాలలకు అందిస్తోంది.