బుద్ధుడి నుండి గద్దర్ వరకు / BUDDUDI NUDI GADDAR VARAKU

బొజ్జ బిక్షమయ్య / Bojja Bikshamaya · Books

బుద్ధుడి నుండి గద్దర్ వరకు / BUDDUDI NUDI GADDAR VARAKU book cover

Price: Rs. 270. స్నేహా టీవి డా॥ శివ భాగ్యారావుగారు ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక ఎంటర్ప్రైన్యూర్ రంగాల్లో ఏక కాలంలో అనేక ప్రయోగాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. సంకల్పబలంతో స్నేహా టీవి, మాస్టర్ టీవీ, ప్రజాపాలన దినపత్రికతో పాటు అనేక సామాజిక సేవా సంస్థలను, ఆర్ధిక సంస్థలను నిర్వహిస్తున్నారు. ఐఆర్ఎస్ ఉన్నత ఉద్యోగాన్ని వదిలి మనం కూడా ఇతరులతో పోటీపడి అన్ని రంగాల్లో ఎదగాలి అని విజన్తో ముందుకు సాగుతున్నారు. అలా వందలాదిమందిని కలుపుకొని బహుముఖాలుగా స్ఫూర్తినిస్తున్నారు. వారి కుటుంబం ఇతర ఉద్యోగాల్లో చేరకుండా సంస్థలనే బలంగా నిర్మించాలని అంకితం కావడం వారి చిత్తశుద్ధికి నిదర్శనం. అలా స్నేహా టీవీలో ఎందరికో అవకాశం వచ్చింది. కమ్మ, రెడ్డి, గుజరాతీ, మార్వాడీ పెట్టుబడిదారులు పెట్టిన సమస్థ రంగాల్లో బహుజనులకు అవకాశాలు నిరాకరిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు. బహుజనుల రాజ్యాధికారం, మహిళల సాధికారికత అన్ని రంగాల్లో ఎంటర్ప్రైన్యూర్గా యువతరం ఎదగాలని అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా పత్రిక నిర్వహణ, టీవి నిర్వహణ కూడా కొత్త పద్దతిలో భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించడం జరుగుతున్నది. పత్రికకు మీరే ఓనర్లు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. టీవీలో కూడా ఇలాంటి పథకం ప్రవేశపెట్టారు. ఇలా వందలాదిమందిని కొత్త రంగాల్లో ప్రవేశించడానికి, నిలదొక్కుకోవడానికి కారణభూతులయ్యారు. ఇలాంటివారు లేకపోతే ఉద్యమకారులైన బొజ్జా భిక్షమయ్య, భీమ్రావు, బి.ఎస్. రాములు, డి.ఎమ్. రవిప్రసాద్ వంటి వారికి నిరంతరం అవకాశాలు ఎక్కడివి? అలాంటి మనకు మనం సృష్టించుకున్న అవకాశాల్లో భాగంగా దశాబ్దాల అనుభవం గల ఉద్యమకారుడు సింగరేణి కార్మిక నాయకుడు మార్క్సిస్టు అయిన బొజ్జా భిక్షమయ్య గారికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఎంత గొప్పగా సద్వినియోగం చేశారో ఈ ఇంటర్వ్యూలో పుస్తకం స్పష్టం చేస్తుంది.

Browse more Telugu books