బి.సి. ఉద్యమం గమ్యం వైపు పయనం / B.C. Movement Journey towards the goal

తదేక యాదగిరి / Tadaka Yadagiri · Politics

బి.సి. ఉద్యమం గమ్యం వైపు పయనం / B.C. Movement Journey towards the goal book cover

Price: Rs. 95. భారతీయ సమాజంలో కులం ఒక సత్యం, కులాల సమూహమే భారతదేశం. ఆచారాలు సాంప్రదాయాలు ఉత్పత్తి, వృత్తి, సేవలు మొదలైన వాటితో కులం గుర్తింపు పొందింది. వందల సంవత్సరాల సామాజిక చరిత్రలో అనేక మార్పుల తర్వాత కూడా కులం పునాదులు నేటికీ చెక్కుచెదరలేదు సరికదా మరింత బలపడుతున్నాయి. ఈ క్రమంలో అధిపత్య కులాలు ఉత్పత్తి సేవా కులాలను తోసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఫలితంగా వృత్తి కులాలు అన్ని రంగాలలో వెనుకబడుతూ వస్తున్నాయి. జాతీయ ఉద్యమ కాలం నుంచి వెనుకబడిన కులాల హక్కుల కోసం మహారాష్ట్రలో సాగిన మహాత్మా జ్యోతిబాపూలే సత్యశోధక ఉద్యమం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వచ్చిన అనేక సామాజిక ఉద్యమాలు బీసీల సాధికారత కోసం వచ్చినవే. ఈ నేపథ్యంలో "కుల వ్యవస్థ- బీసీల సమస్య" గురించి తన వ్యాసంలో ప్రొఫెసర్ కె. శ్రీనివాసులు శాస్త్రీయ పద్ధతిలో లోతైన విశ్లేషణ చేశారు. భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, వ్యక్తి గౌరవం మరియు అంతస్తులోనూ, అవకాశాలలోనూ సమానత్వం అందించేందుకు 75 సంవత్సరాల తర్వాత కూడా నేటికీ మన ప్రభుత్వాలు పురిటినొప్పులు పడుతున్నాయి. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ద్వారా 1953లో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ను కాకా కాలేల్కర్ అధ్యక్షతన నియమించారు. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన 2399 కులాలను అది గుర్తించింది. ఈ కులాల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. 1980లో వెలువడిన మండల్ కమిషన్ నివేదిక భారత ప్రభుత్వానికి 40 సిఫార్సులు చేసింది. 1990లో విపి సింగ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27శాతం రిజర్వేషన్లు కల్పించింది. విద్యా, ఉద్యోగాల్లో మాదిరిగానే స్థానిక సంస్థల్లోని మొత్తం స్థానాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు 2010 మేలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు బీసీ సమాజానికి శాపంగా మారింది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు కేవలం 23% రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుల గణన అంశం ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో కుల గణన చేయాలని డిమాండ్ చేస్తుంది.

Browse more Telugu books