బాలానందం (పిల్లల కోసం వంద నీతి కథలు) / BAALAANANDAM (pillalakosam - 100 Neethi Kathalu)

జి.వి.ఎల్.నరసింహారావు / G.V.L. Narasimha Roa · Children's Books

బాలానందం (పిల్లల కోసం వంద నీతి కథలు) / BAALAANANDAM (pillalakosam - 100 Neethi Kathalu) book cover

Price: Rs. 405. ఇది కథా శతకం! కథలు! ఇవి అన్నీ ఒక్క తరహా కథలు కావు, ఒకే శైలీ, శిల్పంలో ఒదిగినవీ కావు; కాకపోవచ్చు. అయినా కథలే... వంద కథకూ కాళ్ళుంటాయ్. కథా కథన సౌలభ్యమే ఆ కాళ్లు. ఎదుటివారితో ఊకొట్టించేవన్నీ కథలు కావు. వాటిలో కబుర్లూ ఉండవచ్చు. కరకరలూ ఉండొచ్చు. వాటి తరహాలో అవి కథా రూపాలే. కథల్లో కథలు, కథానికలు గల్పికలు ఏవయినా ఉంచవచ్చు. వెనకటితరంలో ఈ రూపాలపై ప్రత్యేక కృషి జరిగింది. ఆ తరువాత హద్దులు చెరిగిపోయాయి. ఆ హద్దుమీరినతనమే ఈ శతక సంపుటిలోనూ కనిపిస్తుంది. ఈ కథాశతకంలో ఉన్నవి ఎక్కువగా జానపద కథలే, యుక్తి కథలు, శక్తి, గెలుపు, కథలుగా కొన్నిటిని వర్గీకరించినప్పటికీ తరచిచూస్తే ఆ అన్నిటిలోనూ జానపద సౌరభాలగుబాళింపులు ఉంటాయి. గాలిలా సెలయేటి జలలా జానపద కథలకు ఎల్లలు ఉండవ్. కాలావధులూ ఉండవ్. ఒక గొంతు నుండి ఒక గొంతుకు, ఒక సీమ నుండి మరొక సీమకు తమంతట తామే పయనిస్తాయి అవి! వీటిలో కొన్ని అరవయిఏళ్ళకు ముందు రచయిత బాల్యంలో విన్న వినికిడి కథలు ఉన్నాయి. అయితే ఆ కథల మూలాలు మన పొరుగు మహారాష్ట్ర, తమిళనాడు, వంగ రాష్ట్రాలలోనూ ఉన్నట్టు తరువాతి కాలంలో గమనించబడింది. ఇక్కడే మరికొంత పరిచయం యివ్వాలి - పుట్టు గుడ్డి, చెవిట్ అయిన హెలెన్ కెల్లర్ విశ్వవిఖ్యాతినంచారు. వినే ఉంటారు, ఆమె రచనలు ఒకటి రెండు అంతకు ముందు కాలానికి చెందిన ఎవరినో పోలి ఉండటం ఒక కాలంలో దుమారం రేపినట్టు గుర్తు ఎలా సంభవం ෂයි? ఒక చారిత్రక సామాజిక పరివర్తనా కాలంలో జీవించిన ఏ యిద్దరు వ్యక్తులు అయినా ఒకలా ఆలోచించటమూ, సృజించటమూ సంభవమే ననటానికి అది తిరుగులేని ఉదాహరణ. ఒకే జానపద నేపథ్యం కల ప్రాంతంలోని కథలలో ఈ పోలికలు మరింత అచ్చు గుద్దినట్టుండవచ్చు. అంత మాత్రాన అవి కాపీ కథలూ కావు కాఫీ కలబోతలూ కాబోవు. కథా శతకంలోని కథలు జానపద నేపథ్యం కలవే కాబట్టి అలాటి అపవాదుకు తావయితే క్షంతవ్యులం! రాజకీయపాత్రికేయ వృత్తి నుండి ఈ రంగానికి వలసవచ్చిన రచయిత కథకుడుగా పరిమిత జ్ఞాని మాత్రమే కూడా.

Browse more Telugu books