బతుకుపోరు / Batukuporu

బి.ఎస్. రాములు / B.S. Ramulu · Novels

బతుకుపోరు / Batukuporu book cover

Price: Rs. 75. 1970ల నుండి సాహిత్యం వ్యాపార సాహిత్యం అనీ, ప్రజా సాహిత్యం అనీ రెండు పాయలుగా వస్తోంది. అయితే నవలల విషయాని కొస్తే ఈ రెండు పాయల్ని మొత్తంగా చూసినా, విడివిడిగా చూసినా మంచి నవలలు తక్కువ. సామాజిక ఉ త్పత్తి సంబంధాల్లో మానవ సంబం ధాల చిత్రణ చేసిన “సామాజిక నవల”లు మరీ తక్కువ. 1982 జూన్లో మొదటి ముద్రణ వచ్చినపుడు ఈ రచయితని “గోర్కీ" అన్నారు. "లూసన్” అన్నారు. 1980-90ల మధ్య వచ్చిన మంచి నవలల్లో 'బతుకుపోరు' ఒకటి. 1990లో రెండవ ముద్రణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వెలువరించింది. ఇది నాల్గవ ముద్రణ. మానవ సంబంధాల్ని, ఉత్పత్తి సంబంధాల్ని సమన్వయిస్తూ తెలంగాణ ప్రజల జీవితాన్ని చిత్రించిన నవల 'బతుకుపోరు'. నేటి స్త్రీ వాద సాహిత్యం వస్తున్న రోజులకు చాలా ముందుగా స్త్రీల జీవితం సంస్కృతి ఆలోచనా విధానం, స్త్రీల భాష, అభివ్యక్తి, ఆశలు - ఆరాటాలు జీవితమంత వాస్తవికంగా చిత్రిం చిన నవల ఇది. తెలంగాణ భాషలో వెలువడి పలువురి మన్న నలు పొంది, డా|| బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ పాఠ్యాంశాల్లో చర్చించ బడిన నవల. 'బతుకుపోరు'లో స్త్రీల సమగ్ర జీవన చిత్రణ, స్త్రీల వ్యవహార దక్షత, తెలంగాణ భాష, సంస్కృతి, సోషలిస్టు రియలిజం గమనించవచ్చు. ఉత్పత్తి సంబంధాల్లో క్రియాశీలంగా పాల్గొనే కార్మిక స్త్రీలను ప్రధానం చేసి చిత్రించిన మొదటి తెలుగు నవల అని చెప్పవచ్చు.

Browse more Telugu books