బక్ / Buck

గాంధీ / GANDHI · Biographies & Auto Biographies

బక్ / Buck book cover

Price: Rs. 112. ఐదు దశాబ్దాల క్రితమే తెలుగు పాఠకుడికి జాక్ లండన్ తెలుసు. ఆయన రాసిన Call of the Wild ఇప్పుడు మళ్లీ బక్ అనే పేరుతో సంక్షిప్త రూపంలో మీ ముందుంది. జాక్ లండన్ పందొమ్మిదో శతాబ్దపు అమెరికా రచయిత. ఓడ కూలి. చాకలి. జాలరి. సీల్ వేటగాడు. ముత్యపు చిప్పల దొంగ. గ్యాంగ్ లీడర్, నావికుడు. కార్ఖానా కూలి. దేశ దిమ్మరి. ఆయన ఇన్ని అవతారాలెత్తాడు. బంగారం వేటలోనూ పాల్గొన్నాడు. ఏ పని చేసినా పైపైన చేయలేదు. అందులో మునిగి తేలాడు. చదివినప్పుడు పిచ్చిగా పడీపడీ చదివాడు. వైవిధ్యం, గాఢత్వం అతని జీవ లక్షణాలు. జీవిత కాఠిన్యాన్ని నాజూకుగా చిత్రించడం జాక్ లండన్కి తెలియదు. ధ్రువ ప్రాంతపు జీవితంలాగే ఆయన చిత్రీకరణ కరుకుగా ఉంటుంది. బక్ ఒక కుక్క అదే ఈ కథలో హీరో. బక్ జీవితంలో ఎన్నో మలుపులు. ఎన్నో కష్టాలు. ఎన్నో అనుభవాలు. పాఠకుడు ఊపిరి సలుపుకోడానికి వీలులేనంత వేగంగా కథ సాగుతుంది.

Browse more Telugu books