ఫౌంటెన్‌ హెడ్ / Fountain head

RENTALA SRIVENKATESWARA ROA / రెంటాల శ్రీవెంకటేశ్వర రావు · Novels

ఫౌంటెన్‌ హెడ్ / Fountain head book cover

Price: Rs. 675. కొన్ని సంవత్సరాల క్రితం నేను ముంబైలోని నా అపార్ట్ మెంట్ అయిన్ రాండ్ మీద తీసిన డాక్యుమెంటరీ "ఎ సెన్స్ ఆఫ్ లైఫ్" చూస్తూ ఉండగా డాక్యుమెంటరీ చివరికొచ్చేసరికి నాకు తెలియకుండానే నా కళ్లెమ్మట నీళ్లు కారటం మొదలుపెట్టాయి. అవి తను పోయినందుకు వచ్చిన కన్నీళ్లు కాదు. తన ఆలోచనల్ని మనతో 'ఫౌంటెన్ హెడ్' ద్వారా మిగిల్చి వెళ్లినందుకు నా ఆనంద బాష్పాలు... అయిన్ రాండ్ రాసిన "ఫౌంటెన్ హెడ్" నా మొత్తం ఆలోచనా విధానాన్ని మార్చి వేసిందంటే, దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు... అమెరికా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఎదగడానికి క్యాపిటలిజం కారణం. అయితే ఆ క్యాపిటలిజంకి ఒక మోరల్ హై గ్రౌండ్ ఇచ్చింది అయిన్ రాండ్. ప్రతి ఫిలాసఫీ ఇతరుల కోసం బతకాలి, దేశం కోసం బతకాలి అని అరచి గీ పెడుతుంటే, అయిన్ రాండ్ ఒక్కత్తే నీ కోసం, నీ స్వార్థం కోసం బ్రతుకు అని చెప్పింది... నీ స్వార్ధంతో, నీ లాభం కోసం పని చేసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఇతరులు కూడా లాభ పడతారు. అంతే కాని కేవలం ఇతరుల కోసం బతికితే నీ బ్రతుకు వల్లకాడైపోతుంది. అది నీకు, ఆ ఇతరులకి కూడ ప్రయోజనం ఉండదు. అని చెప్పింది.

Browse more Telugu books