ప్లేటో రచనలు / PLATO RACHANALU

A.Gandhi / గాంధీ · Books

ప్లేటో రచనలు / PLATO RACHANALU book cover

Price: Rs. 198. ప్లేటో రచనల్లో ఐదు తెలుగులో మీ ముందున్నాయి: ది అపాలజీ ఆఫ్ సోక్రటీస్ కి సోక్రటీసు ఆత్మరక్షణ అనువాదం, యువతను పాడు చేస్తున్నాడన్న నేరారోపణతో సోక్రటీస్ని ఆయన శత్రువులు కోర్టుకు ఈడ్చారు. అక్కడ సోక్రటీస్ తన ఆత్మ రక్షణలో భాగంగా చేసిన ప్రసంగమిది. అతి సాదాగా కనిపించే సోక్రటీసు వ్యక్తిత్వం ఇక్కడ పాఠకుని ముందు అంత ఎత్తున సాక్షాత్కరిస్తుంది. ఈ గ్రంథంలో రెండో రచన క్రిటో. సోక్రటీసుకి మరణశిక్ష అమలుజరపడానికి రెండు రోజుల ముందు సోక్రటీసు క్రిటోల మధ్య జైలు గదిలో జరిగిన సంభాషణ ఇది. సోక్రటీసు జైలు నుంచి తప్పించుకు పోవడానికి వీలుగా తాను అంతా ఏర్పాటు చేశానని చెప్తాడు క్రిటో. అప్పుడు సోక్రటీసు పలికిన పలుకులు చిరస్మరణీయం. ఫేడో ఈ గ్రంథంలో మూడో రచన. విషం తాగడానికి ముందువరకూ సోక్రటీసు ఎన్నో విషయాలను ప్రశాంతంగా, నిర్విచారంగా చర్చించాడు. ఆ కథనమే ఫేడో. మనిషి ఈ లోకంలో ఎలా జీవించాలి, దేని గురించి తపన పడాలి, దేనిని తిరస్కరించాలి. దేనిని పూర్తిగా పరిత్యజించాలి. అనే అంశాలపైన ప్లేటో భావాలకిది ప్రతిబింబం. అయోన్ నాలుగో రచన, అయోన్ ఒక గాయకుడు, తాను తన జ్ఞానంతోనూ, ప్రతిభతోనూ కావ్యగానం చేయ గలుగుతున్నాను అనుకుంటాడు, అయోన్. అలా కాదంటాడు, సోక్రటీసు. అసమానమైన తన తర్కంతో చివరికి అయోన్ని సైతం ఆయన ఒప్పిస్తాడు. ఐదో రచన మెనో. మెనో యువకుడు. శ్రీమంతుడు. సుగుణం అంటే ఏమిటి అన్న అంశంపైన సోక్రటీస్కీ, మెనోకీ మధ్య ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఆ చర్చే మెనో.

Browse more Telugu books