ప్రేమలహరి / PremaLahari
Dr. Ramakrishna Sura / డాక్టర్ రామకృష్ణ సూర · Novels

Price: Rs. 225. ఈ నవల నా రెండవ సాహసం. మొదట నవల "చూడాలని" చదివిన వారు నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. చాలా మంది మీ తదుపరి నవల ఎప్పడు అని పాఠకులు అడుగుతున్నారని బుక్ సేలర్స్ చెప్పారు. ఆ ఉత్సాహంతో నేను రెండవ నవల రాయడం మొదలు పెట్టాను. ఈ నవలలో రాసిన పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవికావు. కేవలం కథకోసం రాసిన కలిపితాలే. కొన్ని సంఘటనలు కాకతాళికం కావచ్చును. ఈ నవలలో కథ 1970-80దశకంలో గల గ్రామీణ వాతావరణాన్ని, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు మరియు నేను చిన్నప్పుడు చూసిన సంఘటనలను ఆధారంగా రాయడం జరిగింది. ఇందులో జంతువుల సంభాషనలను రాయడం జరిగింది. ఆ మూగజీవుల మాటలను వాటి బావనలను మాటల రూపంలో కొంత వరకు రాయగలిగానని అనుకుంటున్నాను. ఈ నవల్లో యుక్త వయస్సులో కలిగే ప్రేమలను గురించి చెప్పే ప్రయత్నం చేశాను. కాలాలు మారిన జగతి ఉన్నంతకాలం ప్రేమ మాత్రం శాశ్వతమై మరియు సజీవమై వుంటుంది. కొన్ని ప్రేమలు సఫలమైతే మరి కొన్ని ప్రేమలు సరైన సమయంలో వ్యక్తంచేయలేక జీవితాలు తారుమారు అయిన సంఘటనలను ఈ నాటికీ చూస్తున్నాం.ఈ నవల పూర్తికావడానికి ముఖ్య కారకురాలు నా శ్రీమతి సుజాత నా జీవిత భాగస్వామే కాదు, నా రచనల్లో కూడా తనదీ సగ భాగమే. శ్రీ కృష్ణకుమార్ ( రిటైడ్ లీగల్ అడ్వైజర్) న్యూఢిల్లీలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ నవల ముద్రణకు ప్రధాన కారకుడైన శ్రీ వై. మాలకొండయ్య గారికి నా ధన్యవాదాలు.