ప్రపంచ వాణిజ్య సంస్థ - ఒప్పందం / "World Trade Organization - Agreement"

దొండి లక్ష్మీనారాయణ / Dondi Lakshminarayana · Politics

ప్రపంచ వాణిజ్య సంస్థ - ఒప్పందం / "World Trade Organization - Agreement" book cover

Price: Rs. 35. అంతర్జాతీయ ఒప్పందం జరిగినప్పుడు, ఆ ఒప్పందం దేశంలో అమలు చేయడానికి కొంత విరామ సమయం ఇవ్వడం జరుగుతుంది. ఒప్పందంలో పొందుపర్చిన నియమ నిబంధనలు ప్రజలకు అర్ధం చేయించి, ప్రజలను మానసికంగా సంసిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుంది. అందుకే విరామ సమయం ఇవ్వడం జరుగుతుంది. దాన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. తేది 15-12-1994 రోజు భారత ప్రభుత్వం W.T.O. Agreement పై సంతకం చేసింది. ఈ ఒప్పందం అమలు చేయడానికి 10 సం॥లు విరామ సమయం ఇవ్వడం జరిగింది. కాబట్టి తేది 1-1-2005 నుండి ఈ ఒప్పందం అమలు జరగడం ప్రారంభమౌతుంది. W.T.O. ఒప్పందంలో వ్రాసుకున్న ప్రకారం పరిపాలన చేయాలి. మన రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగించలేము. ఎందుకంటే? W.T.O. ఒప్పందంపై భారత ప్రభుత్వం సంతకం చేసింది. W.T.O. ఒప్పందంలో వ్రాసిన నియమ నిబంధనల ప్రకారం భారత ప్రజలను పరిపాలించాలి. భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాధ్యంకాదు. ఎందుకంటే W.T.O. ఒప్పందం ఉల్లంఘించి నట్లయితే అమెరికా మరియు ఫ్రాన్స్ యూరోప్ దేశాలు అగ్రరాజ్యాలు, అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసుపెట్టి భారతదేశాన్ని అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగదు. తేది 1-1-2005 నుండి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, లేదా 5, 6 రాజకీయ పార్టీల అలయన్స్ అధికారంలోకి వచ్చినా W.T.O. Agreement (ఒప్పందం) ప్రకారం పరిపాలించాలి. భారత రాజ్యాంగంలో వ్రాసిన ప్రకారం పరిపాలన జరగదు. W.T.O. ఒప్పందం ప్రకారం పాలించాలి.

Browse more Telugu books