ప్రజాకవి దాశరథి సాహిత్యం /PRAJAKAVI DASHARATHI SAHITHYAM
డా॥ దాశరథి కృష్ణమాచార్య /Dr. Dasharathi Krishnamacharya · Literature

Price: Rs. 405. కోతిని మనిషిగా తొలిచిన కాస్మిక్ రేడియేషన్ బలమే నా కలంలో చొరబడి - నేడు మనిషిని దేవతగా మలుస్తుంది. చితి మంటల యుద్ధానికి - ప్రతి కవి ఒక ఫైర్ బ్రిగేడ్, అణ్వస్రపు గ్రీష్మానికి - ప్రతి పద్యం మబ్బు ముక్క" అని పలికిన దాశరథిగారు కవులే కాదు వ్యాసాలూ, కథలూ, నాటికలూ మొదలైనవి అసంఖ్యాకంగా వ్రాశారు. వారి లేఖినీ మహత్వంతో పావనం కాని సాహిత్య ప్రక్రియ అంటూ లేదు. వా రేది వ్రాసినా - ముందుకు తోసుకు పోవాలనే గిజగిజ యుగయుగాల నుంచీ స్తబ్దరూపంలో వుండిపోయిన సంఘాన్ని ముందుకు అతివేగంగా ఒక రాకెట్వలె నడపాలనే తహతహ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే గతం యొక్క ప్రాముఖ్యం, ప్రాశస్త్యం వారికి తెలియనిది కాదు. వారు పండిత వంశంలో జన్మించి భారతీయ సాంప్రదాయాలనూ, సంస్కృతీ వైభవాన్నీ పూర్తిగా అవలోకన చేసి జీర్ణించుకున్నట్టివారు. దాశరథిగారి కృతులు చదువుతుంటే భావనలోనూ, భావప్రకటనలోనూ ఇంత వైవిధ్యం వున్న కవులు మరొకరు లేరు. అనిపిస్తుంది నాకు. "కంటికి కనిపించిందంతా - కైతగా రాసేస్తున్నాను.... నావి యక్సు - కిరణాల కళ్లేమో! నాకేంతెలుసు, లోకమా? కంటికి కనిపించిందంతా - కైతగా రాసేస్తున్నాను" అన్న దాశరథిగారు మహాకవులు. ఇదీ అదీ కాకుండా, విశ్వాన్నంతా తన హృదయంలోకి పీల్చుకొని పోగలరు. అగ్నిసెగలను, మమతలను, మానవతను బయటకు ఊదగలిగిన ప్రతిభావంతులు. వారు అపారమైన సృజనశక్తి కలిగిన సృష్టికర్తలు. తమ సృజన శక్తి విశృంఖలంగా ఉద్దీపింప జేసుకోగలిగిన ధీమంతులు దాశరథిగారు.