ప్రకృతి జ్యామితి / Prakruthi Jyamithi
శ్రీనివాస చక్రవర్తి / Srinivasa Chakravarthi · Novels

Price: Rs. 135. పగలు-రాత్రి, ఆరు రుతువులు, లయబద్ధమైన గ్రహగతులు - ఇలా గోడగడియారంలా కచ్చితమైన ఆవృత్తి గల విశ్వలయలని ఊహించింది న్యూటోనియన్ భౌతికశాస్త్రం. గ్రహాలు నున్నని గోళాలనీ పర్వతాలు శంకువులనీ గ్రహకక్ష్యలు దీర్ఘవృత్తాలనీ బోధించింది. యూక్లిడియన్ జ్యామితి. స్థిరత్వం, నిత్యత్వం, ఆవృత్తి అన్న విశ్వాసాలు ఈ సాంప్రదాయక విజ్ఞానానికి పునాదులు. అయితే ఇరవయ్యవ శతాబ్దపు రెండవభాగంలో కొందరు వైజ్ఞానిక విప్లవకారులు ఈ పునాదులను ధ్వంసం చేశారు. ఇందుగలదు అందులేదనలేమంటూ.. ప్రకృతిలో అణువణువునా కల్లోలాన్నే దర్శించి ప్రదర్శించారు ఈ చిచ్చరపిడుగులు. ఆ కల్లోలంలో ఉన్న లయనీ దర్శించారు వీళ్లు. క్రమం, క్రమరాహిత్యం రెండు ముఖాలుగా గల ఓ విశ్వసత్యం కల్లోలం. 'కల్లోల ప్రపంచం' గ్రంథానికి కొనసాగింపే' ప్రకృతి జామితి'.