పిల్లలకోసం / PILLALA KOSAM

chalam / చలం · Books

పిల్లలకోసం / PILLALA KOSAM book cover

Price: Rs. 85. పిల్లల మనసులలో పుట్టే సహజ తర్కం, వాటినుండి పుట్టే ప్రశ్నలు పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వాటికి ఊపిరాడని పెద్దలు సమాధానం చెప్పలేక కోప్పడో, కళ్లు పోతాయని భయపెట్టో, నీకు చెప్పినా ఇపుడు అర్థంకాదులే అనో, తమ పెద్దరికం మాటున దాక్కుంటారు. స్వాతంత్య్రం అనే కొత్తభావం పిల్లవాడికి తెలియదు. ముసలమ్మకు తెలియదు. ఎవరికయినా అనుభవంలోకి వస్తేనే కదా తెలిసేది. అది తెలియనివారి మధ్య సంభాషణే ఒకనాటిక. పిల్లలకు ఎలాంటి నాటికలు కావాలో కొన్ని మచ్చుకు వ్రాసి చూపారు చలం. పిల్లలకోసం పాటలు, గేయాలు వ్రాసిన చింతా దీక్షితులు, ఆడిపాడిన బి.వి. నరసింహరావు చలం మంచి మిత్రులు. వారుభయులు పిల్లల అమాయికతను, వారి స్వచ్ఛమయిన ఉల్లాసాన్ని చిత్రించారు. చలం పిల్లలలోని ప్రశ్నలను చూశారు. చలం పిల్లలకోసం కొన్ని చిన్న కథలు వ్రాసారు. ఎక్కడో మరుగునపడిన అతి చిన్న పిల్లలకు చెప్పదగిన కథలు కొన్ని మొదటిసారి మళ్ళీ బయటకు వస్తున్నాయి.

Browse more Telugu books