పాలపుంత / Paalapunta

Editor · Literature

పాలపుంత / Paalapunta book cover

Price: Rs. 135. లోపల కడలి కల్లోలం బయట గెలాక్సీ గాంభీర్యం స్నేహం, ప్రేమ, పోరాటాలను పోగుచేసిన ఆమె ఓ పాలపుంత, పరిమళ గీతం. స్వేచ్ఛ... పేరు వినగానే అరమరికలు లేని స్నేహం, కల్మషంలేని నవ్వు, నిండైన ఆత్మవిశ్వాసం స్ఫురణలోకి వస్తాయి. ఆమె నవ్వులో తడిసి తన్మయమొందని వేస్తులుండరు. విశాల ప్రపంచాన్ని తన సొంతం చేసుకున్నట్టు, గొప్ప మానవ సంబంధాలు నెరిపిన మనిషి స్వేచ్ఛ. తన నమ్మకాలకు కట్టుబడి జీవించే నైజం ఆమెది. సుడిగుండాల్లాంటి సంక్షోభాలను నిబ్బరంగా ఎదుర్కొనే ఆమె, ఎందుకు అలసిపోయింది? ఆమె నిష్క్రమణ ఒంటరి జీవితపు ఓటమి కాదు సామూహిక వైఫల్యం. స్వేచ్ఛతో రెండు దశాబ్దాల స్నేహం. ఒకరకంగా మా ఊరు పిల్లే. నకిరేకల్లోనే చదువుకుంది. శంకరన్న, శ్రీదేవి అక్కల కూతురుగా సమాజం పట్ల ప్రేమను పెంచుకుంది. ప్రపంచ ముందు ఒకలా, ప్రైవేటుగా ఒకలా ఉండడం తెలియని స్వచ్ఛమైన మనిషి. జీవితంలో ఎదగాలనే ఆకాంక్ష, మాటల్లో జంకులేనితనం ఆమెలో బలంగా కనిపించేవి.

Browse more Telugu books