పామర సంస్కృతం / pamara sanskrotamu
డా॥ కపిలవాయి లింగమూర్తి / Kapilavai Lingamurthy · Literature

Price: Rs. 270. పాలమూరు జిల్లా తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణం గల జిల్లాలలో ఒకటి, నందరాజులు, మౌర్యులు, ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, బాదామీ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణీ చాళుక్యులు, కందూరు చోడులు, కాకతీయులు, మల్యాల, గోన, చెరుకు రెడ్డి రాజులు, వావిలాల, దేవగిరి యాదవులు, ముసునూరి రాజులు, రేచర్ల పద్మనాయకులు, బహమనీ సుల్తానులు, విజయనగర సామ్రాజ్య రాజులు, కుతుబ్షాహీ, మొఘల్ చక్రవర్తులు మరియు నిజాం అసఫ్ జాహీ వంశరాజులు ఏలిన ప్రాంతమిది. శతాబ్దాలుగా వివిధ సంస్కృతులు పాలమూరు జిల్లాలో మిళితమైనవి. ఇక్కడి జానపదుల యాస, భాష చాలావరకు శబ్దార్థచంద్రికలో గాని, శబ్ద రత్నాకరంలో గాని పేర్కొనబడలేదు. ఈ జనపదుల పదసంపదను ఒకచోట గ్రంథస్థం చేసి అంతరించిపోతున్న పదసంపదను కాపాడుటకు "పరిశోధనా పంచానన" కపిలవాయి లింగమూర్తి గారి కృషి బహుధా ప్రశంసనీయం. దీనిలోని పదాలన్నీ నియమబద్ధమైన పదాలు. అపభ్రంశమైన పదాలు స్వీకరించలేదు. దీనికి అనుచందంగా జానపదుల ద్వందాలు, ఊతపదాలు, జాతీయాలు, భాషీయాలు, న్యాయాలు చేర్చడం జరిగింది. దీనిలోని పదాలకు లాక్షణికార్థాలు, రూపసాధన కూడ తెలపడం జరిగింది. పాలమూరు వాసులు మాట్లాడే పదాలు ఎంతో శ్రమ కోర్చి, సేకరించి అందించిన డా॥ కపిలవాయి లింగమూర్తి గారి కృషి తెలుగు మాట్లాడే వారందరికి పాలమూరు మాండలికం పరిచయం చేస్తుంది.