పల్లేరుకాయలు / PALLERUKAAYALU
డా॥ బి.వి.ఎన్.స్వామి / Dr. B.V.N SWAMY · Novels

Price: Rs. 108. రచయితగా ఎదిగిన బి.వి.ఎన్.స్వామి జీవితంలో ఎన్ని పార్శ్వాలుంటాయో. అన్ని పార్శ్వాలు చిత్రించిన రచన 'పల్లేరుకాయలు'. పలు బాధలు, పలు ఎదురీతలు, పలు స్వాంతనలు ప్రతిబింబించిన ఆత్మకథ ఇది. ఆత్మకథనం మాత్రమే కాదు, స్వామి అంతర్మథనం. పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు మనల్ని వెంబడిస్తాయి. కనుక ఇది నవల, బి.వి.ఎన్.స్వామి జీవన ప్రయాణాన్ని చిత్రించింది గనుక 'ఆత్మకథాత్మక నవల'. పల్లేరు కాయల మీంచి సాగే బాధిత బాటసారులెందరికో ఈ నవల కొత్త బలాన్నిస్తుంది. చేవనూ, చైతన్యాన్ని, గెలుపు సంకల్పాన్ని చేకూరుస్తుంది. సేద తీరుస్తుంది.